Prabhas:హ్యాపీ బర్త్‌డే ప్రభాస్

2
- Advertisement -

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తనదైన నటన, భారీ యాక్షన్ సన్నివేశాలు, విభిన్నమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు ప్రభాస్. రొమాంటిక్ హీరోగా కెరీర్ ప్రారంభించిన ఆయన.. బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు.

2002లో విడుదలైన ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత వచ్చిన వర్షం సినిమా ఆయన కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచింది. ఈ చిత్రంతో ప్రభాస్‌కు మంచి గుర్తింపు లభించింది.

దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమాలో ప్రభాస్ తన పవర్‌ఫుల్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అనంతరం డార్లింగ్ , మిస్టర్ పర్‌ఫెక్ట్ వంటి చిత్రాలతో ప్రేమకథల హీరోగానూ మెప్పించాడు. మిర్చి సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ప్రభాస్ కెరీర్‌ను పూర్తిగా మార్చేసిన సినిమా బాహుబలి . దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. శివుడు, అమరేంద్ర బాహుబలి పాత్రల్లో ప్రభాస్ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. బాహుబలి 2 తో ఆయన క్రేజ్ దేశవ్యాప్తంగా మరింత పెరిగింది.

బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ చిత్రంతో మరోసారి తన యాక్షన్‌ సత్తాను చాటాడు. కల్కి 2898 ఏడీ తో సైన్స్ ఫిక్షన్ ప్రపంచంలోకి అడుగుపెట్టి మరో విభిన్నమైన పాత్రలో ప్రేక్షకులను అలరించాడు.

Also Read:పాలమూరుకు కరువు..రేవంత్ వైఫల్యమే

విభిన్న కథలను ఎంచుకుంటూ, భారీ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రభాస్‌కు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

- Advertisement -