భారత్‌కు మరో రెండు స్వర్ణాలు..

4
- Advertisement -

పారా ఆసియా క్రీడలు 2026లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో నితేశ్ కుమార్, నవీన్ శివకుమార్ స్వర్ణ పతకాలు సాధించి భారత్‌కు గర్వకారణంగా నిలిచారు. తమ ప్రత్యర్థులపై అద్భుత ఆటతీరుతో విజయాలు అందుకుని పతకాల పట్టికలో భారత్ ఖాతాలో మరో రెండు స్వర్ణాలను చేర్చారు.

పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఎస్‌ఎల్‌3 విభాగం ఫైనల్లో నితేశ్ కుమార్ తన తోటి భారత ఆటగాడు, పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత ప్రమోద్ భగత్‌తో తలపడ్డాడు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో నితేశ్ 21-18, 21-16 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు.

ఈ విజయంపై నితేశ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశాడు. గతసారి తుది పోరులో మూడో గేమ్‌లో 19-16తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఓటమి పాలయ్యానని గుర్తుచేసుకున్నాడు. ఈసారి రెండు గేముల్లోనే ప్రమోద్‌పై గెలిచి స్వర్ణం సాధించడం ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందని పేర్కొన్నాడు.

మరోవైపు, స్వర్ణం సాధించాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రమోద్ భగత్ రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతంలో వరుసగా రెండు ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించానని, ఈసారి మూడో స్వర్ణం గెలవాలని ప్రయత్నించినప్పటికీ కొన్ని షాట్లలో పొరపాట్లు, అంచనాల్లో తేడాల కారణంగా విజయం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

Also Read:పాలమూరుకు కరువు..రేవంత్ వైఫల్యమే

పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఎస్‌ఎల్‌4 విభాగం ఫైనల్లో భారత ఆటగాడు నవీన్ శివకుమార్ ఇండోనేషియాకు చెందిన ఫ్రెడీ సెటియావాన్‌తో పోటీపడ్డాడు. ఈ మ్యాచ్‌లో నవీన్ 21-9, 21-17తో విజయం సాధించాడు. కేవలం 36 నిమిషాల్లోనే ప్రత్యర్థిని ఓడించి భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు.నవీన్ సాధించిన ఈ విజయం పారా ఆసియా క్రీడలు 2026లో భారత్‌కు 24 స్వర్ణాలు గెలిచింది.

- Advertisement -