జైలర్ 2@రూ.541 కోట్లు

8
- Advertisement -

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.541 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ నివేదికలు వెల్లడించాయి.

దసరా సెలవుల ప్రభావంతో సినిమా వసూళ్లు పుంజుకున్నాయి. ఆరో రోజు భారతదేశంలో రూ.45.55 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు సాక్‌నిల్క్ గణాంకాలు పేర్కొన్నాయి. దీంతో దేశీయంగా సినిమా నెట్ కలెక్షన్లు రూ.287.80 కోట్లకు, గ్రాస్ వసూళ్లు రూ.337 కోట్లకు చేరాయి. విదేశీ మార్కెట్లలోనూ మంచి ఆదరణ లభించడంతో ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూళ్లు రూ.541 కోట్లకు చేరుకున్నాయి.

Also Read:రామాయణం..విజనరీ మూవీ

ఆరో రోజు వసూళ్లలో తమిళ వెర్షన్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఈ వెర్షన్‌ రూ.31.20 కోట్లు వసూలు చేయగా, తెలుగు వెర్షన్‌ రూ.8.75 కోట్లు, హిందీ వెర్షన్‌ రూ.5 కోట్లు సాధించాయి. కన్నడ వెర్షన్‌ రూ.60 లక్షల వసూళ్లు రాబట్టింది. ‘జైలర్ 2’ తొలి నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.418.25 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి తమిళ చిత్రాల్లో భారీ ఓపెనింగ్ వీకెండ్ రికార్డును నమోదు చేసింది. కేవలం ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల మార్కును దాటడం మరో విశేషం. దీంతో రజనీకాంత్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. మొత్తానికి ‘జైలర్ 2’ జోరు చూస్తుంటే రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమా పూర్తి రన్‌లో ఎంత వసూలు చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -