బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన సినీ పరిశ్రమలో కలకలం రేపింది. ఈ ఘటన అనంతరం నటి దిశా పటానీ ఆయనను కలిసేందుకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ముంబైలోని జుహు ప్రాంతంలో ఆదివారం టైగర్ ష్రాఫ్ కారుపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరుగగా ఈ ఘటన తర్వాత టైగర్ క్షేమసమాచారం తెలుసుకునేందుకు దిశా పటానీ ఆయన నివాసానికి వెళ్లారు.
టైగర్, దిశా గతంలో బాఘీ 2 సినిమాలో కలిసి నటించారు. వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. మరోవైపు టైగర్‌పై కాల్పుల ఘటనను అఖిల భారత సినీ కార్మికుల సంఘం (AICWA) తీవ్రంగా ఖండించింది. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులపై వరుసగా దాడులు జరుగుతుండటం ఆందోళనకరమని పేర్కొంది. బాధ్యులను గుర్తించి అరెస్టు చేయాలని, బెదిరింపులు, దాడులకు పాల్పడే నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
Also Read:జనవరి 12 విడుదల..అప్డేట్
కాల్పుల ఘటనలో టైగర్ డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి గాయపడినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. టైగర్‌కు ప్రాణాపాయం తప్పినప్పటికీ వరుస ఘటనల నేపథ్యంలో ముంబైలో సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులకు మరింత భద్రత కల్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

