బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న 13 ఏళ్ల బాలుడికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. నేను నీకు అండగా ఉంటా.. భయపడకు అంటూ ఆ బాలుడికి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్య సహాయం అందేలా చూస్తామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నరసింహులగూడెం గ్రామానికి చెందిన కర్నె ఆదినారాయణ, అనిత దంపతుల కుమారుడు వినయ్ ప్రస్తుతం బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఈ పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలవాలని, ఆయనతో కలిసి ఫొటో దిగాలని వినయ్ కోరుకున్నాడు.
బాలుడి కోరిక గురించి తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రావు వెంటనే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వినయ్‌కు కేటీఆర్‌ను కలిసే అవకాశం లభించింది. ఈ సందర్భంగా బాలుడితో కేటీఆర్ ఆప్యాయంగా మాట్లాడి, అతనిలో ధైర్యాన్ని నింపారు.
అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వినయ్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు సహకరిస్తామని కేటీఆర్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని, అతనికి అండగా ఉంటానని భరోసా కల్పించారు.
Also Read:Reality:ఆలోచనగా దేవికా భట్
తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతున్న సమయంలో తన అభిమాన నాయకుడిని కలవాలన్న వినయ్ కోరిక నెరవేరడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. బాలుడికి అవసరమైన వైద్య సహాయం అందించేందుకు కేటీఆర్ ముందుకు రావడంపై వారు కృతజ్ఞతలు తెలిపారు.

