నవంబర్‌లో అనిరుధ్‌–కావ్యా పెళ్లి!

9
- Advertisement -

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు యజమాని కావ్యా మారన్‌ వివాహంపై ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. నవంబర్‌లో వీరి వివాహ వేడుకలు జరగనున్నట్లు సమాచారం.

కావ్యా మారన్‌, అనిరుధ్‌ రవిచందర్‌ వివాహ రిసెప్షన్‌ నవంబర్‌ 21న చెన్నైలో జరగనుంది. కావ్యా మారన్‌ సన్‌ గ్రూప్‌ అధినేత కళానిధి మారన్‌ కుమార్తె. ఐపీఎల్‌లో ప్రముఖ జట్టైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కార్యకలాపాల్లో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు.

మరోవైపు అనిరుధ్‌ రవిచందర్‌ దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర సంగీత దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. తన ప్రత్యేకమైన సంగీతంతో యువతలో విశేషమైన అభిమానాన్ని సంపాదించుకున్నారు. అయితే వివాహ వేడుక ఎక్కడ జరుగుతుంది.. ఇతర కార్యక్రమాల తేదీలు ఏమిటనే వివరాలపై సంబంధిత వ్యక్తుల నుంచి పూర్తి సమాచారం వెలువడాల్సి ఉంది.

Also Read:Reality:ఆలోచనగా దేవికా భట్

- Advertisement -