హర్మన్‌ప్రీత్ కౌర్ తన కెప్టెన్సీ పదవికి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధానను నియమిస్తున్నట్లు బిసిసిఐ (BCCI) ప్రకటించింది.2013 నుండి భారత జట్టులో సభ్యురాలిగా ఉన్న మందాన గతంలో 22 వైట్-బాల్ (పరిమిత ఓవర్ల) మ్యాచ్‌ల్లో భారత్‌కు నాయకత్వం వహించారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు 2024, 2026 లలో టైటిల్స్ అందించడం ద్వారా అన్ని ఫార్మాట్లలో ఆమె నాయకత్వ ప్రతిభను నిరూపించుకున్నారు.
ఆమె ఇప్పటివరకు 18 T20I మ్యాచ్‌ల్లో భారత్‌కు నాయకత్వం వహించగా అందులో 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 6 మ్యాచ్‌ల్లో ఓటమి ఎదురైంది, ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇక వన్డేల్లో (ODIs) ఆమెకు తిరుగులేని రికార్డు ఉంది; కెప్టెన్‌గా వ్యవహరించిన 4 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించారు. WPLలో RCB జట్టుకు 35 మ్యాచ్‌ల్లో సారథ్యం వహించి 18 విజయాలు, 17 ఓటములు నమోదు చేశారు.
కెప్టెన్‌గా ఇన్నేళ్లు హర్మన్‌ప్రీత్ అందించిన సేవలను, కృషిని నేను అభినందిస్తున్నాను అని చెప్పారు స్మృతి. ఆమె ఎంతో నిబద్ధతతో జట్టును నడిపించారు.. మన ప్రయాణంలో ముఖ్యమైన పాత్ర పోషించారు అని చెప్పారు. భారత జట్టుకు నాయకత్వం వహించే బాధ్యత దక్కడం చాలా ప్రత్యేకమైన గౌరవం. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు ఎప్పుడూ ఎంతో గర్వకారణం, ఇప్పుడు జట్టును నడిపించే అవకాశం రావడం నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఈ పదవితో వచ్చే బాధ్యతను నేను అర్థం చేసుకున్నాను. జట్టుతో కలిసి పనిచేస్తూ, ముందుకు సాగే క్రమంలో నేర్చుకుంటూ, భారత క్రికెట్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాను అని పేర్కొన్నారు.
భారత T20I స్క్వాడ్:
స్మృతి మంధాన (కెప్టెన్), షెఫాలీ వర్మ (వైస్ కెప్టెన్), నికి ప్రసాద్, హర్మన్‌ప్రీత్ కౌర్, అనుష్క శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి కమలిని (వికెట్ కీపర్), దీప్తి శర్మ, ప్రేమ రావత్, శ్రీ చరణి, నందిని శర్మ, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, జింటిమణి కలిత, మిన్ను మణి.
భారత వన్డే (ODI) స్క్వాడ్:
స్మృతి మంధాన (కెప్టెన్), షెఫాలీ వర్మ, ప్రతిక రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్, హర్లీన్ డియోల్, తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ (వైస్ కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), యస్తిక భాటియా (వికెట్ కీపర్), వైష్ణవి శర్మ, నందిని శర్మ, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, సాయలీ సత్‌ఘరే, రేణుకా ఠాకూర్.
Also Read:Sigma:వసూళ్లు..ఐదో రోజు ఎంతంటే?

