పదేళ్లుగా సనా ఖాన్ సినిమాల్లో నటిస్తున్న బ్రేక్ మాత్రం రాలేదు. హిందీ సినిమాలతో పాటు తెలుగు.. కన్నడ.. తమిళ సినిమాల్లో కూడా నటించేసింది. తెలుగులో కళ్యాణ్ రామ్ కత్తి చిత్రంతో పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత గగనం.. మిస్టర్ నూకయ్య మూవీస్ లో కనిపించింది.
తాజాగా ‘వజయ్ తుమ్ హో’ అనే అడల్ట్ కంటెంట్ హిందీ సినిమాలో నటించింది ఎంత రెచ్చిపోయిన నటించినా మూవీ ప్లాప్ అయింది.. పోనీ అమె అందాలు చూసి అవకాశాల వచ్చాయా అంటే ఒక్కటీ రాలేదు. అయినా సరే ఈ అమ్మడు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.
ఇదిలా ఉండగా.. తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా వస్తోన్న ‘టాయిలెట్ – ఏక్ ప్రేమ్ కహానీ’లో సనా ఖాన్ నటిస్తోంది. భూమి ఫడ్నేకర్ హీరోయిన్గా చేస్తుంటే.. సనా సపోర్టింగ్ రోల్‌తో సరిపెట్టుకుంది. అయితే ‘టాయిలెట్’లో తన రోల్‌కి ఇంపార్టెన్స్ వుంది కాబట్టే చేస్తున్నానని సనా అంటోంది. అక్షయ్ కుమార్‌కి, తనకి మధ్య వున్న సీన్లు సూపర్‌గా వచ్చాయని, హీరోతో పోటీపడి నటించడానికి చాలా హోం వర్క్ చేశానని తెలిపింది.