KTR:బీఆర్ఎస్ నేతల అరెస్ట్ దుర్మార్గం

15
- Advertisement -

జూరాల ఆయకట్టుకు సాగునీరిచ్చి పంటలు కాపాడాలని రైతుల పక్షాన డిమాండ్ చేసిన ఉమ్మడి పాలమూరు జిల్లా బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ పార్టీ నేతలందరినీ అక్రమంగా నిర్బంధించడం రేవంత్ రాక్షస మనస్తత్వానికి నిదర్శనం అన్నారు.

కళ్లముందే పంటలు ఎండిపోయి అల్లాడుతున్న అన్నదాతల గోసను ప్రభుత్వం తీర్చాల్సింది పోయి, న్యాయమైన డిమాండ్‌తో నిరసనకు సిద్ధమైన బీఆర్ఎస్ శ్రేణులను అణచివేసేందుకు రేవంత్ సర్కారు కుట్ర చేస్తోంది. సీఎంగా విఫలమైన రేవంత్ తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే, జిల్లాలోని అనేక మండలాల్లో బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలకు చీకటి ఆదేశాలిచ్చాడు అన్నారు.

జూరాల ప్రాజెక్టులో 9 టీఎంసీల నీటి లభ్యత ఉన్నా, నీళ్లను విడుదల చేయకుండా పనికిరాని కుంటిసాకులతో రేవంత్ సర్కారు పచ్చని పంటల ఉసురు తీస్తోంది. తమ పంటలను కాపాడుకునే ఏకైక తపనతో గుండెపగిలిన రైతులు జూరాల గేట్లు ఎత్తే ప్రయత్నం చేస్తే, వారిపై అక్రమ కేసులు బనాయించిన ప్రభుత్వం అన్నదాతలను అన్నివిధాలా అరిగోస పెడుతోంది అన్నారు.

తెలంగాణ గడ్డపై ఉన్న జూరాల ప్రాజెక్టు పరిసరాల్లోకి రైతులు రాకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటుచేసి, వందలాది పోలీసులను చుట్టుపక్కల మోహరించడం ముమ్మాటికీ సిగ్గుమాలిన చర్య. తాగునీటికి కేవలం రెండు టీఎంసీలు సరిపోతాయని తెలిసినా, 9 టీఎంసీలున్న జూరాల నుంచి చుక్క నీరు విడుదల చేయకుండా ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు రైతులను సంక్షోభంలోకి నెట్టడం క్షమించరాని పాపం. అక్రమంగా అరెస్టు చేసిన బీఆర్ఎస్ నేతలను ప్రభుత్వం విడుదల చేయడంతో పాటు జూరాల ఆయకట్టు రైతులకు తక్షణమే సాగునీరు విడుదల చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.. లేకపోతే అన్నదాతల ఆగ్రహానికి ఈ కాంగ్రెస్ సర్కారు కుప్పకూలడం ఖాయం అని హెచ్చరించారు.

Also Read:Cult:#కల్ట్ అక్టోబర్ 30న

- Advertisement -