22A డైవర్షన్ కోసమే కేసీఆర్ భూములు అంటూ డ్రామా చేస్తున్నారు అని మండిపడ్డారు మాజీమంత్రి కేటీఆర్. మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. అసమర్థ, చేతగాని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతాడు అన్నారు.
మూడేళ్లుగా నువ్వు చేసింది ఏం లేదు, కనీసం రెండేళ్లైనా ప్రజలకు పనికొచ్చే పనులు చెయ్ ….మా మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టినా నువ్వు ఏం పీకలేవు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాళేశ్వరం, ప్రగతి భవన్ మీద చేసినట్టే కేసీఆర్ మీద మరో దుష్ప్రచారం చేస్తున్నారు…కేసీఆర్ కుటుంబానికి లక్ష కోట్ల భూములు ఉన్నాయని రేవంత్ రెడ్డి అంటున్నాడు అన్నారు. మాకు వెయ్యి కోట్లు ఇస్తే మా ఆస్తులు నీకే ఇస్తాం..మిగతా 99 వేల కోట్లతో ప్రజలకు పనికొచ్చే పనులు చెయ్యి…తమిళనాడు సీఎం విజయ్ రేసింగ్ కోసం లండన్ వెళ్లి పెట్టుబడులు తేవాలని చూస్తున్నాడు అన్నారు.
Also Read:నానితో కయాదు లోహార్..
అలాంటి గొప్ప రేసింగ్ హైదరాబాద్కు తెస్తే నా మీద అక్రమ కేసు పెట్టారు…ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తట్టుకుంటాం, న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది అన్నారు.

