సోషల్ మీడియా రీల్స్ మరియు ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం వల్ల ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరూ అధిక ప్రోటీన్ ఆహారం వెనుకే పరుగులు తీస్తున్నారు. అయితే కేవలం ప్రోటీన్ మాత్రమే తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సాధ్యపడదని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ప్రతీ రోజూ అత్యధికంగా ప్రోటీన్ సప్లిమెంట్లు లేదా సప్లిమెంట్ ఆధారిత ఆహారం తీసుకోకపోతే శరీరం బలహీనపడిపోతుందనే అపోహను రీల్స్ పెంచుతున్నాయి.
అధిక ప్రోటీన్ తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై (Kidneys) భారం పెరిగే అవకాశం ఉంది. వ్యక్తి బరువు, శారీరక శ్రమను బట్టి రోజుకు సగటున ఒక కిలో బరువుకి 0.8 నుండి 1 గ్రాము ప్రోటీన్ సరిపోతుంది.
ఒక పరిపూర్ణ భోజనం లేదా సమతుల్య ఆహారంలో ప్రోటీన్‌తో పాటు ఇతర పోషకాలు సరైన నిష్పత్తిలో ఉండాలి.కార్బోహైడ్రేట్లు శక్తిని ఇవ్వడానికి తృణధాన్యాలు (రైస్, మిల్లెట్స్, గోధుమలు) అత్యవసరం.
ప్రోటీన్లు…కండరాల నిర్మాణానికి పప్పుధాన్యాలు, గుడ్లు, పాలు, చికెన్/చేపలు లేదా పనీర్.
ఫైబర్ & విటమిన్లు: జీర్ణక్రియకు సహాయపడే ఆకుకూరలు, తాజా కూరగాయలు మరియు పండ్లు.
Also Read:అసెంబ్లీ ఘటనపై ఢిల్లీకి బీఆర్ఎస్ బృందం
ఆరోగ్యకరమైన కొవ్వులు (Healthy Fats): హార్మోన్ల సమతుల్యతకు నెయ్యి, నట్స్ (బాదం, జీడిపప్పు) మరియు గింజలు.
ప్రోటీన్ పొడులు మరియు కృత్రిమ ప్రత్యామ్నాయాల కంటే సహజ సిద్ధమైన ఇంటి వంటకాల ద్వారా లభించే పోషకాలే ఆరోగ్యానికి అత్యంత సురక్షితమైనవి.

