తెలంగాణలో ఫేక్ ముఖ్యమంత్రి రాజ్యమేలుతున్నడు…గత 30 నెలలుగా ఫేక్ న్యూస్‌లతో ప్రభుత్వాన్ని నడిపిస్తూ..నిన్న అసెంబ్లీ సాక్షిగా అడ్డంగా దొరికిపోయిండు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్. రాష్ట్రంలో ఒక వ్యక్తి కోసం వెతుకుతున్నారు..ఆ అదృశ్య వ్యక్తి ఎవరో తెలియడం కోసం మేము పోలీసులను ఆశ్రయించడం జరిగింది..రేవంత్ రెడ్డే.. సంధ్యారావుని సృష్టించారు అని మండిపడ్డారు.రెడ్కో మాజీ ఛైర్మన్ సతీష్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడిన ప్రవీణ్ కుమార్…ఎవరో మత్తులో ఉండి నకిలీ ఖాతాలతో అసత్య ప్రచారాలు చేస్తే ఏమో అనుకోవచ్చు..కానీ స్వయంగా రేవంత్ రెడ్డి అలా చేయడం ఏంటో అర్థం కావడం లేదు అన్నారు.
సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలతో కాంగ్రెస్ ప్రభుత్వం మా పార్టీపై, నాయకులపై అసత్య ప్రచారం చేస్తోంది..దానిపై సైబర్ క్రైమ్ డీసీపీకి ఫిర్యాదు చేశాం..నకిలీ అకౌంట్ల సృష్టికర్త రేవంత్ రెడ్డి.. అసెంబ్లీ వేదికగా అబద్దాలు మాట్లాడుతున్నారు. సమస్య లపై మాట్లాడేందుకు మా సభ్యులు అసెంబ్లీకి వెళ్తుంటే దాడి చేశారు..మహిళా ఎమ్మెల్యేలపై అమానుషంగా ప్రవర్తించారు..మా ఎమ్మెల్సీ తాతా మధు పై అబద్ధాలతో ప్రచారం చేశారు..అసలు స్పీకర్ ను అవమానించింది కాంగ్రెస్ పార్టీ నాయకులే..వారే స్పీకర్ ను దళితుడు అని ప్రతిసారి గుర్తు చేశారు..పోలీసులు పెట్టిన కేసులో కూడా తాతా మధుపై ఆ వ్యాఖ్యలు చేసినట్లు లేదు..విర్లపల్లి శంకర్ కేసీఆర్ పై దారుణంగా మాట్లాడారు..ఎర్రవల్లి నివాసానికి కాంగ్రెస్ గుండాలు వెళ్లారు..దానికి నిరసనగా మా నాయకులు పసుపు నీళ్లతో శుభ్రం చేశారు..అది దళితులు వెళ్లినందుకు కాదు.. కాంగ్రెస్ నేతలు వెళ్లినందుకు..సంధ్యారావు.. పింక్ మాస్క్ పెట్టుకున్నా మహిళా పేరుతో అకౌంట్ ఉంది..సంధ్య రావు బిఆర్ఎస్ పేరుతో ఖాతా ఉన్నా.. వాయిస్ పురుషుడిది..ఆ అకౌంట్ లో పోస్ట్ పెడితే ఆ విషయాన్ని అసెంబ్లీలో చర్చకు తెచ్చారు..సంధ్య రావు బి ఆర్ ఎస్ అంతర్జాతీయ కార్యదర్శి అని రేవంత్ రెడ్డి చెప్పారు..ఒక పార్టీకి అంతర్జాతీయ కార్యదర్శి అనే పదవి ఉండదు అన్నారు.
దీనిపై విచారణకు ఒక సిట్ వేశారు..నేరం చేసింది రేవంత్ రెడ్డి.. దాని విచారణ కు ఆదేశింది కూడా రేవంత్ రెడ్డి..దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం..పోలీసులు విచారణ జరపాలి. వెంటనే కేసు నమోదు చేసి నిందితులను పట్టుకోవాలి. పోలీసులు కాలయాపన చేయకుండా త్వరగా నిందితులను పట్టుకోవాలి..మీరు మాదిగలను ఘోరంగా అవమానించారు..స్పీకర్ ను తరచుగా దళితుడని గుర్తు చేస్తున్నారు..స్పీకర్ ను చూస్తే మీకు ఎందుకు అంత అక్కసు..దళితులకు గొప్ప చరిత్ర ఉంది.. మానవ జాతి కోసం దళితులు ఎన్నో సేవలు అందిస్తున్నారు..మాదిగ డప్పుకు కూడా చాలా విశిష్టత ఉంది.. కేసీఆర్ ఇచ్చిన ఒక్క పిలుపు తో అదే డప్పు తో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నరూ..మాదిగలు ఎవరు కూడా ఒకరి చావు కోరుతూ డప్పు కొట్టరు..వేముల వీరేశం కూడా అక్కడికి వెళ్ళారు.. ఆయనను వెంటనే కుల బహిష్కరణ చేయాలి..ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లో మాదిగలపై అనేక అకృత్యాలు జరిగాయి.. ఎన్ని అకృత్యాలు జరిగినా ఏనాడు మాదిగలు ఒకరి చావు కోరుతూ డప్పు కొట్టలేదు..
మాదిగ డప్పుకు తప్పుడు అర్థం తెచ్చినా రేవంత్ రెడ్డి.. మాదిగ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం..రేవంత్ రెడ్డి అలియాస్ సంధ్య రావు..చేవెళ్ల డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.
కేసీఆర్ 1000 గురుకుల పాఠశాలలు నిర్మించారు.. అందులోని తిండిని దోచిన వ్యక్తి రేవంత్ రెడ్డి..కేసీఆర్ దళితుల కోసం కోడింగ్ అకాడమీ పెడితే దాన్ని కూడా రేవంత్ రెడ్డి మూయించారు..సాంసృతిక అకాడమీ పెడితే దాన్ని నిర్వీర్యం చేశారు..కేసీఆర్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మించడం జరిగింది.. సెక్రటేరియట్ కు ఆయన పేరు పెట్టారు..దళితులను కాంట్రాక్టులు చేశారు.. దళిత బంధు పథకం అమలు చేశారు..దళితులను విదేశాలకు పంపింది కేసీఆర్..డప్పులు కొట్టిన చేతులు డాలర్లను సంపాదిస్తున్నారు..మీ హాయంలో ఎస్సీ నిధులు మళ్ళించారు.. ఎస్సీ కమిషన్ కు ఒక్క రూపాయి ఇవ్వలేదు..మీ హాయంలో ఇలాంటివి ఎప్పుడైనా ఆలోచించారా..మీ స్వార్థ రాజకీయాల కోసం డప్పులను వాడుకోవడం హేయం..మా మహిళ ఎమ్మెల్యేలు ఇచ్చిన కంప్లైంట్ పై కేసులు పెట్టడం లేదు..పోలీసులు కూడా ఆలోచించాలి.. జాగ్రత్తగా వ్యవహరించాలి..ఎర్రవల్లి వెళ్ళిన వారిలో వేరే కులం వాళ్ళు కూడా ఉన్నారు..సంధ్యారావు ను సృష్టింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. లక్షల ట్విట్టర్ అకౌంట్లు ఉన్నా, సంధ్యారావు అకౌంటే ఎలా దొరికింది..వేల పోస్టులు ఉన్నా, ఈ పోస్టునే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎలా చదివారు చెప్పాలన్నారు.

