అభిషేక్ బర్త్‌డే..యువీ సర్‌ప్రైజ్

1
- Advertisement -

న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అభిషేక్ శర్మ మైదానంలోకి దిగనున్నాడు. ఇక ఇవాళ ఈ యువ ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మ 26వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఇన్స్టాగ్రామ్‌లో అభిషేక్‌తో ఉన్న ఫోటోలతో పాటు, వారిద్దరి మధ్య ఉన్న సరదా అనుబంధాన్ని చూపే ఒక వీడియోను యువీ పంచుకున్నాడు.

తప్పుల నుండి పాఠాలు నేర్చుకుంటూ కష్టపడి పనిచేసే అభిషేక్ తత్వాన్ని ప్రశంసిస్తూ యువరాజ్ భావోద్వేగపూరిత పోస్ట్ రాసుకొచ్చాడు. మిస్టర్ అభిషేక్.. ఈ రోజు నీ పుట్టినరోజు, ఎంతో శుభదినం! నీ చుట్టూ ఉన్నవారి పట్ల ప్రేమ, శ్రద్ధ చూపే ఒక నాయకుడిగా నువ్వు ఎదిగిన తీరు నాకు ఎంతో నచ్చింది. వైఫల్యాల నుండి నేర్చుకుంటూ, ప్రతిసారీ మరింత కష్టపడే నీ తత్వం అభినందనీయం. ఈ ఏడాదంతా నువ్వు కొండంత పరుగులతో, సెంచరీలతో చెలరేగాలని కోరుకుంటున్నాను.. గాఢమైన ప్రేమతో అని యువరాజ్ పోస్ట్ చేశాడు.

మ్యాచ్‌లలో అనవసరమైన లేదా బాధ్యతారాహిత్యమైన షాట్లు ఆడి అవుట్ అయినందుకు గాను అభిషేక్‌తో యువీ చెవులు పట్టుకుని గుంజీలు తీయించడం ఈ వీడియోలో కనిపించింది. మళ్లీ అలాంటి తప్పులు చేయనని ఆ యువ బ్యాటర్ చేత ప్రామిస్ కూడా చేయించాడు. మెంటార్‌గా మార్గదర్శనం చేస్తూనే, సరదా వాతావరణాన్ని కొనసాగించే వీరిద్దరి అనుబంధం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Yuvraj Singh (@yuvisofficial)

- Advertisement -