ఆసియా కప్ 2026 మ్యాచ్‌లో హాంకాంగ్‌పై 137 పరుగుల భారీ విజయాన్ని సాధించి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న అనంతరం హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు మైదానంలోనే కాకుండా వెలుపల కూడా తమ ఉదారతతో అభిమానుల మనసులను గెలుచుకుంది.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ ముగిసిన తర్వాత పోటీతత్వాన్ని పక్కనబెట్టి రెండు జట్ల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంది. భారత మహిళల క్రికెట్ జట్టు హాంకాంగ్ చైనా క్రీడాకారులను తమ డ్రెస్సింగ్ రూమ్‌కి ఆహ్వానించింది. అక్కడ ఇరు జట్ల ఆటగాళ్ళు కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ జెర్సీలను మార్చుకోవడమే కాకుండా జ్ఞాపకార్థం ఆటోగ్రాఫ్‌లు ఇచ్చిపుచ్చుకున్నారు.
చిరునవ్వులు, ఎన్నో నేర్చుకునే అంశాలు మరియు తీపి జ్ఞాపకాలతో డ్రెస్సింగ్ రూమ్‌లో మ్యాచ్ తర్వాతి ప్రత్యేక ముచ్చట్లు” అని బిసిసిఐ (BCCI) శుక్రవారం ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.హాంకాంగ్ ఆటగాళ్లకు భారతదేశపు స్టార్ క్రికెటర్లతో నేరుగా మాట్లాడే అరుదైన అవకాశం లభించింది అని తెలిపారు స్మృతి మందాన. దీప్తి శర్మ.. జెర్సీలపై ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ, హాంకాంగ్ స్పిన్నర్లకు బౌలింగ్ వేరియేషన్లు మరియు మ్యాచ్ ప్రిపరేషన్ గురించి ముఖ్యమైన చిట్కాలను అందించారు.
ఈ ప్రత్యేక సెషన్ ద్వారా హాంకాంగ్ ప్లేయర్లు తమ సందేహాలను నివృత్తి చేసుకుని, టీమ్ ఇండియా నుంచి ఎన్నో ఉపయోగకరమైన విషయాలను తెలుసుకున్నారు.రిచా ఘోష్, భారతి ఫుల్మాలి, నందిని శర్మ, ప్రతిక రావల్, శ్రీ చరణి, ప్రేమ రావత్, రేణుకా సింగ్ ఠాకూర్ మరియు షెఫాలీ వర్మ కూడా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో శిక్షణ, ప్రిపరేషన్ మరియు అంతర్జాతీయ క్రికెట్లోని సవాళ్ల గురించి కాసేపు చర్చించారు.భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మరియు హాంకాంగ్ కెప్టెన్ నటాషా మైల్స్ మధ్య ఒక అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. హర్మన్‌ప్రీత్ హాంకాంగ్ క్రీడాకారిణి మరియం బీబీ కోసం మ్యాచ్ బంతులు మరియు షర్ట్‌పై ఆటోగ్రాఫ్ ఇచ్చిన అనంతరం కెప్టెన్ నటాషాతో తన జెర్సీని మార్చుకున్నారు.
Team India 🤝 Team Hong Kong
A memorable post-match catch-up in the dressing room with a lot of smiles, learnings and pictures 📸😁#TeamIndia | #WomensAsiaCup | #INDvHK | @CricketHK pic.twitter.com/TVxrJ3wH5K
— BCCI Women (@BCCIWomen) September 4, 2026

