బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ భర్త డాక్టర్ శ్రీరామ్ నేనే, ప్రముఖ స్టార్ జంట అనుష్క శర్మ – విరాట్ కోహ్లీతో తనకు జరిగిన ఒక ఆసక్తికర సంభాషణను గుర్తుచేసుకున్నారు. వారు భారతదేశాన్ని వదిలి లండన్‌కు ఎందుకు మారాలనుకుంటున్నారో అనుష్క శర్మ తనకు వివరించినట్లు ఆయన తెలిపారు.
యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాహ్‌బాదియాతో జరిగిన సంభాషణలో డాక్టర్ శ్రీరామ్ నేనే మాట్లాడుతూ…ఒకరోజు అనుష్కతో మాట్లాడే అవకాశం వచ్చింది. భారత్‌లో పొందే విపరీతమైన ప్రజాదరణ, మీడియా దృష్టి వల్ల వారు తమ విజయాలను మనస్ఫూర్తిగా ఆస్వాదించలేకపోతున్నామని అందుకే లండన్‌కు మారాలని ఆలోచిస్తున్నామని అనుష్క చెప్పింది అని తెలిపారు.
విరాట్, అనుష్కలు ఏం చేసినా వెంటనే మీడియా మరియు ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. దీనివల్ల వారు ఒక రకమైన ఐసోలేషన్ (ఏకాంతం) అనుభవించాల్సి వస్తుందని డాక్టర్ నేనే అభిప్రాయపడ్డారు. సెలబ్రిటీ లైఫ్ కి దూరంగా తమ పిల్లలను (వామిక, అకాయ్) ఒక సాధారణ వాతావరణంలో, మీడియా హడావుడి లేకుండా పెంచాలని ఈ జంట కోరుకుంటోందని ఆయన పేర్కొన్నారు.
తాము ఎక్కడికి వెళ్లినా సెల్ఫీల కోసం ప్రజలు రావడం, వ్యక్తిగత సమయానికి భంగం కలగడం వంటివి సాధారణమే అయినప్పటికీ, అది కొన్నిసార్లు ఇబ్బందికరంగా మారుతుందని, విరాట్-అనుష్కలు మాత్రం చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నవారని ఆయన కొనియాడారు.
Also Read:‘మైసా’..రిలీజ్ డేట్ ఖరారు!

