ఇరాన్‌తో చర్చలు లేవు:ట్రంప్

1
- Advertisement -

పశ్చిమాసియా (మధ్యప్రాచ్యం)లో విమానాల రద్దు, వైమానిక సరిహద్దుల మూసివేత మరియు ప్రయాణ అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉండటంతో అమెరికా పౌరులకు అగ్రరాజ్యం అత్యవసర భద్రతా హెచ్చరికలను జారీ చేసింది. ఇరాన్‌ను చర్చల మేజరు వద్దకు తీసుకురావడానికి అమెరికా ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ వస్తున్న వార్తలను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. టెహ్రాన్‌తో దౌత్యపరమైన ఒప్పందం చేసుకోవడంపై తనకు ఎలాంటి ఆసక్తి లేదని స్పష్టం చేశారు.

వ్యూహాత్మకంగా కీలకమైన హోర్ముజ్ జలసంధి దాదాపు పూర్తిగా అమెరికా బలగాల నియంత్రణలోనే ఉందనే విషయాన్ని ట్రంప్ పునరుద్ఘాటించారు. ఇరాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని (ఆర్థిక వ్యవస్థ కూలిపోవడం) ఎదుర్కొంటోందని, ప్రస్తుతం అమెరికా ఉన్న పొజిషనే చాలా బలమైనదని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read:‘మైసా’..రిలీజ్ డేట్ ఖరారు!

వైట్ హౌస్ ఇరాన్‌ను చర్చలకు ఒత్తిడి చేస్తోందంటూ ఎబిసి న్యూస్ (ABC News) ప్రసారం చేసిన వార్తలను ట్రూత్ సోషల్ (Truth Social) వేదికగా ట్రంప్ తప్పుబట్టారు. ఇరాన్‌తో చేసుకునే ఏ ఒప్పందమైనా ఉపయోగం లేనిదని అభిప్రాయపడ్డారు. ఇరాన్ ప్రజలు టెహ్రాన్‌లోని ప్రస్తుత ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

- Advertisement -