జియో హాట్‌స్టార్‌..UK మార్కెట్‌లోకి!

1
- Advertisement -

భారతీయ ఓటీటీ దిగ్గజం JioHotstar తన సేవలను ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ అంతర్జాతీయ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. బ్రిటన్ (UK), కెనడా, సింగపూర్ దేశాలలో తన స్ట్రీమింగ్ సేవలను ప్రారంభించినట్లు సంస్థ బుధవారం ప్రకటించింది.

భారత్ వెలుపల గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌గా ఎదిగే క్రమంలో భాగంగా యూకే, కెనడా, సింగపూర్‌లలో సేవలు ప్రారంభించింది. ఈ మూడు దేశాల్లోని వీక్షకులకు 12 కంటే ఎక్కువ భాషల్లో, విభిన్న విభాగాలకు చెందిన సుమారు 1,60,000 గంటలకు పైగా కంటెంట్ లైబ్రరీ అందుబాటులో ఉంటుంది.

ఈ వేదికపై ప్రతి సంవత్సరం 30,000 గంటలకు పైగా కొత్త (ఫ్రెష్) కంటెంట్‌ను జోడించనున్నట్లు కంపెనీ తెలిపింది.టీవీ షోలు, సినిమాలు, ప్రాంతీయ కార్యక్రమాలు , నాన్-ఫిక్షన్, పిల్లల ప్రోగ్రామ్‌లు మరియు యానిమేషన్ కంటెంట్ అన్నీ ఒకే ప్లాట్‌ఫామ్‌పై లభిస్తాయి.

Also Read:‘మైసా’..రిలీజ్ డేట్ ఖరారు!

వినియోగదారుల అనుభవం: పర్సనలైజ్డ్ సిఫార్సులు .. ఇంటరాక్టివ్ ఫీచర్లు మరియు సులభతరమైన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లతో అంతర్జాతీయ చందాదారులను ఆకట్టుకునేలా ఈ సేవలను తీర్చిదిద్దారు.

- Advertisement -