వాషింగ్టన్ వెనిజులాకు చెందిన 65 బిలియన్ బారెళ్ల చమురు నిల్వలపై ఆధీపత్యం చెలాయించేలా చారిత్రాత్మక ఒప్పందం కుదిరిందని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికా దళాల చర్యల వల్ల వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రభుత్వం కూలిపోయిన కొన్ని నెలల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఒప్పందం కోసం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ (యుద్ధ) మంత్రి పీట్ హెగ్సెత్లు వెనిజులా నూతన అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్‌తో కలిసి పనిచేస్తున్నారని 80 ఏళ్ల రిపబ్లికన్ నాయకుడు ట్రంప్ తెలిపారు. ఈ లావాదేవీ ఇరు దేశాల మధ్య “ఇప్పటికే పెరుగుతున్న సంబంధాలను” మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ చారిత్రాత్మక ఒప్పందం అమెరికా చమురు నిల్వలను రెట్టింపు కంటే ఎక్కువ చేస్తుంది, మన చమురు సరఫరాను గణనీయంగా పెంచుతుంది మరియు అమెరికన్లందరికీ పెట్రోల్/గ్యాస్ ధరలను చాలా కాలం పాటు తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే వెనిజులాను అపారమైన విజయం, గొప్ప సమృద్ధి వైపు తీసుకెళ్లడానికి తోడ్పడుతుంది” అని ట్రంప్ ‘ట్రూత్ సోషల్’లో రాసుకొచ్చారు.ప్రపంచ చరిత్రలోనే వెనిజులాతో మనం చేసుకున్న ఈ ఒప్పందం అత్యంత పెద్ద చమురు ఒప్పందం అని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న దేశాల్లో వెనిజులా ఒకటి. యుఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ అంచనా ప్రకారం, ఈ దక్షిణ అమెరికా దేశంలో సుమారు 303 బిలియన్ బారెళ్ల ముడి చమురు నిల్వలు ఉన్నాయి, ఇది ప్రపంచంలో మొత్తం సరఫరాలో దాదాపు 17 శాతానికి సమానం. ఈ చమురు నిల్వలు ఎక్కడ ఉన్నాయో స్పష్టంగా తెలిసినప్పటికీ, సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల వెనిజులా ప్రపంచ చమురు ఉత్పత్తిలో కేవలం 1 శాతం మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతోంది.
వెనిజులాలో పెట్టుబడులు పెట్టాలని ట్రంప్ పరిపాలనా యంత్రాంగం అమెరికన్ కంపెనీలను వరుసగా కోరుతోంది. ఈ ఒప్పందం కింద, ప్రైవేట్ కంపెనీలు వెనిజులా చమురు క్షేత్రాలను అభివృద్ధి చేయడానికి అనుమతించబడతాయి, అయితే దీనికి ప్రతిఫలంగా అమెరికాకు భాగస్వామ్య యాజమాన్యం లభిస్తుందని Axios ఇద్దరు యుఎస్ అధికారులను ఉటంకిస్తూ నివేదించింది.
Also Read:MEA:320 మంది భారతీయులు మిస్సింగ్

