హారర్, మిస్టరీ, అడ్వెంచర్ సినిమాలను ఇష్టపడే సినీ ప్రియులకు ఒక అద్భుతమైన థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు సరికొత్త చిత్రం ‘బోయునా’ సిద్ధమవుతోంది. అడవుల నేపథ్యం, వెన్నులో వణుకు పుట్టించే విజువల్స్‌తో తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్ ప్రేక్షకులను భయపెట్టేందుకు థియేటర్లలోకి అడుగుపెట్టబోతోంది.
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, దట్టమైన అమేజాన్ అడవుల్లో నివసించే ఓ భారీ రాక్షస సర్పం (అనకొండ) చుట్టూ ఈ చిత్ర కథ తిరుగుతుంది. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ మరియు భయానకమైన సౌండ్ డిజైన్‌తో ఈ చిత్రాన్ని మలచారు. ప్రతీ సన్నివేశం ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించేలా రూపుదిద్దుకుంది.
కేవలం జంప్ స్కేర్లు మాత్రమే కాకుండా కథలో ఉన్న నిగూఢమైన మిస్టరీ, అడవిలో చిక్కుకున్న పాత్రల ఉత్కంఠభరితమైన పోరాటం ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయి. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో అంచనాలు నెలకొల్పిన ఈ హారర్ థ్రిల్లర్ అక్టోబర్ 2న భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. థియేటర్ అనుభూతిని ఇష్టపడే ప్రతి హారర్ లవర్ తప్పక చూడాల్సిన చిత్రంగా ‘బోయునా’ నిలవనుంది.
Also Read:చిదంబరంకు శివరాజ్ కౌంటర్

