కర్ణాటకలో H1N1 విజృంభణ

2
- Advertisement -

కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల H1N1 ఇన్‌ఫ్లుయెంజా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రజలకు హెచ్చరికలు మరియు మార్గదర్శకాలను జారీ చేసింది. వర్షాకాలంలో సాధారణంగా వచ్చే మార్పుల్లో భాగంగానే కేసుల సంఖ్య పెరుగుతోందని ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

సాధారణంగా రాష్ట్రంలో ప్రతి ఏటా రెండుసార్లు — జనవరి నుండి మార్చి వరకు, అలాగే జులై నుండి సెప్టెంబర్ వరకు — ఈ సీజనల్ ఇన్‌ఫ్లుయెంజా కేసులు పెరుగుతుంటాయని తెలిపింది. ల్యాబ్ పరీక్షల నివేదికల ప్రకారం…2026 ఆగస్టు 22 నాటికి కర్ణాటకలోని 32 జిల్లాల్లో 4,212 హెచ్1ఎన్1 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత సంవత్సరాల గణాంకాలతో పోలిస్తే (2025లో 4,583 కేసులు, 2024లో 3,903 కేసులు) ఈ నమోదైన సంఖ్య స్థిరంగానే ఉందని అధికారులు వెల్లడించారు.హాస్పిటల్ మౌలిక వసతులు, ల్యాబ్ నిరీక్షణ సదుపాయాలు మరియు ‘ఒసెల్టామివిర్’ (Oseltamivir) వంటి అత్యవసర ఔషధాల నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.

ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. తుమ్మినా, దగ్గినా ముక్కు మరియు నోటికి చేతిరుమాలు లేదా మాస్క్ అడ్డుపెట్టుకోవాలి.ముక్కు, కళ్ళు, నోటిని తరచూ చేతులతో తాకకూడదు.సబ్బు మరియు నీటితో క్రమం తప్పకుండా చేతులను శుభ్రం చేసుకోవాలి.డాక్టర్ సలహా లేకుండా సొంతంగా మందులు వాడకూడదు .పుష్కలంగా మంచి నీరు, ద్రవాహారం తీసుకోవాలి.లక్షణాలు ఉన్నప్పుడు ఇతరులతో షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదు.వ్యాధి లక్షణాలు కనిపిస్తే ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండాలి.లక్షణాలు ఉన్నప్పుడు రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకూడదు.తీవ్రత ఎక్కువైతే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలి.వాడిన టిష్యూలు, రూమాళ్లను మళ్లీ మళ్లీ ఉపయోగించకూడదు.

Also Read:TAUK:ఇండియా డే వేడుకల్లో తెలంగాణం

- Advertisement -