సహజ చిట్కాలతో దోమలు పరార్!

2
- Advertisement -

ఇంటి నుంచి దోమలను తరిమికొట్టేందుకు సహజసిద్ధమైన చిట్కాలు వర్షాకాలం మరియు వేసవి వాతావరణంలో ఇళ్లల్లో దోమల మోత, బెడద ఎక్కువగా ఉంటుంది. నిలిచి ఉన్న నీటిని తొలగించడం, కిటికీలకు మెష్‌లు అమర్చుకోవడం వంటి చర్యలతో పాటు సూచించిన కొన్ని సులువైన చిట్కాలతో దోమలు ఇంట్లోకి రాకుండా అడ్డుకోవచ్చు.

దోమల నివారణకు ముఖ్యమైన చిట్కాలు…నిలిచి ఉన్న నీటిని తొలగించండి:దోమలు ఎక్కువగా నిల్వ ఉన్న నీటిలోనే గుడ్లు పెట్టి వృద్ధి చెందుతాయి. కాబట్టి పూల కుండీల కింద ఉండే ప్లేట్లు, బకెట్లు, ఎయిర్ కూలర్లు, డ్రెయిన్లు మరియు ఖాళీ పాత్రల్లో వర్షపు నీరు లేదా గృహ వ్యర్థ నీరు చేరకుండా క్రమం తప్పకుండా ఖాళీ చేయాలి.

గదిలో తిరిగే సీలింగ్ లేదా టేబుల్ ఫ్యాన్ల గాలి ప్రవాహానికి దోమలు సులభంగా ఎగరలేవు. ముఖ్యంగా పడుకునే ప్రదేశాలు, లివింగ్ రూమ్‌లలో ఫ్యాన్ తిరగడం వల్ల దోమలు కుట్టకుండా కాపాడుకోవచ్చు. కిటికీలు, తలపులకు నెట్ (జాలీ)లను ఉపయోగించండి:ఇంట్లోకి దోమలు రాకుండా ఉండేందుకు కిటికీలు, తలుపులకు నాణ్యమైన నెట్‌లు లేదా స్క్రీన్‌లను అమర్చాలి.

పాత జాలీలకు రంధ్రాలు ఉంటే వెంటనే సరిచేయడం ద్వారా దోమల ప్రవేశాన్ని పూర్తిగా అడ్డుకోవచ్చు. సిట్రోనెల్లా , యూకలిప్టస్, లెమన్‌గ్రాస్ (నిమ్మగడ్డి), మరియు లావెండర్ వంటి బలమైన సువాసన కలిగిన మొక్కలు లేదా ఎసెన్షియల్ ఆయిల్స్ దోమలను నివారిస్తాయి. వీటిని కిటికీలు, తలుపుల వద్ద ఉంచడం మంచిది. ఎసెన్షియల్ ఆయిల్స్‌ను చర్మంపై రాసుకునేటప్పుడు తగిన మోతాదులో ద్రావణంతో పలుచన చేసి వాడాలి.

Also Read:మనుస్మృతిపై రాహుల్ ఫైర్

ఇంటి బయట అనవసరంగా వెలిగే లైట్లను తలుపులు, కిటికీలకు కాస్త దూరంగా ఉంచడం ద్వారా పురుగులు, దోమలు ఇంట్లోకి రాకుండా చూడవచ్చు.ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా దోమల బెడద నుంచి ఇంటిని సురక్షితంగా కాపాడుకోవచ్చు.

- Advertisement -