జారీబంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వాతావరణంలో ఒక్కసారిగా తీవ్ర మార్పులు సంభవించాయి. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD – హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
వర్షాలతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఉత్తర, తూర్పు జిల్లాలకు అలర్ట్రానున్న 72 గంటల్లో ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో జాగ్రత్త – అధికారుల సూచనలువర్షాల సమయంలో ఉరుములు, మెరుపులు ఉధృతంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు, అధికారులు ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read:మనుస్మృతిపై రాహుల్ ఫైర్
వర్షం పడే సమయంలో పొలాల్లోని బహిరంగ ప్రదేశాలు, విద్యుత్ స్తంభాలు లేదా ఒంటరి చెట్ల కింద ఆశ్రయం పొందకూడదు.వాహనదారులుపాత భవనాలు, నశిస్తున్న చెట్లు, భారీ హోర్డింగ్‌ల కింద వాహనాలు నిలపవద్దు.సాధారణ ప్రజలుఅత్యవసరమైతే తప్ప వర్షం పడే సమయంలో బయటకు రాకూడదు. పిడుగుల నుంచి సమాచారం పొందడానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) సిఫార్సు చేసిన ‘డామిని’ యాప్‌ను ఉపయోగించవచ్చు.వాతావరణంలో మార్పుల పట్ల ప్రజలు నిరంతరం అవగాహనతో ఉంటూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

