- Advertisement -
సినిమా టికెట్ ధరల పెంపుపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. టికెట్ ధరల పెంపు ద్వారా వచ్చిన కలెక్షన్‌లో 20% సంక్షేమం కోసం తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGFDC)కు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
పెద్ది, రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు, అఖండ 2 సినిమాల టికెట్ ధరల పెంపుతో వచ్చిన కలెక్షన్‌లో 20% తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్, TGFDC ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది తెలంగాణ ప్రభుత్వం.
ఆ మొత్తాన్ని ఎగ్జిబిటర్ల నుంచి వసూలు చేయాలని నిర్మాతలకు సూచించగా ఇటీవల విడుదలైన, త్వరలో రాబోతున్న భారీ చిత్రాలకు ఈ నిబంధన కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం.
Also Read:ఆల్ టైం క్లాసిక్ ..’గీతాంజలి’!
- Advertisement -

