22-ఏ బాధితులకు అండగా బీఆర్ఎస్

3
- Advertisement -

జీతాలే ఇవ్వకుండా అది ఉద్యోగం ఎలా అవుతుంది అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్‌లో 22 ఏ బాధితులతో మీడియాతో మాట్లాడిన హరీష్‌.. నువ్వు ఇచ్చాను అని చెబుతున్న 70 వేల ఉద్యోగాలలో 6 వేల లైసెన్స్డ్ సర్వేయర్స్ ఉద్యోగాలు కూడా భాగమేగా రేవంత్ రెడ్డి? అన్నారు.

మరి నువ్వు వాళ్లకి ఒక్క రూపాయి జీతం ఇవ్వకుండా అది ఉద్యోగం ఎలా అవుతుంది…ఐఏఎస్ లోకేష్ కుమార్ దగ్గరికి వెళ్లి అడిగితే రైతుల దగ్గర లంచం తీసుకోమని చెబుతున్నాడు అంట…ఒక ఐఏఎస్ అధికారి అయి ఉండి అలా మాట్లాడొచ్చా? మీరు పోయి పొంగులేటిని కలిస్తే చేతిలో ఏది ఉంటే అదే తీసుకొని కొడుతాడు అని మాట్లాడుతున్నాడు అంటా అని మండిపడ్డారు.పొంగులేటి ఏం అనుకుంటున్నాడు.. లోకేష్ ఏం అనుకుంటున్నాడు చెప్పాలన్నారు.

ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జీతాలు ఇవ్వక ఇద్దరు యువ లైసెన్స్డ్ సర్వేయర్లు ఆత్మహత్య చేసుకున్నారు…జీతం రాదు, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీం లేదు, ట్రావెల్ అలవెన్స్ లేదు.. పెట్రోల్ ఖర్చు ఎక్కువ, సర్వే చేస్తే వచ్చేది తక్కువ అన్నారు. ఈ బాధలు కలెక్టర్లకు చెప్తే అడుక్కోండి, లంచాలు తీసుకోండి అని అంటున్నారు…లైసెన్స్డ్ సర్వేయర్లకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది.. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మీ తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం అన్నారు.

Also Read:ఆల్ టైం క్లాసిక్ ..’గీతాంజలి’!

- Advertisement -