‘బాసింగ బలాలు’ అనే ప్రముఖ ఫోక్ సాంగ్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న జానపద కళాకారుడు ఈశ్వర్ సాయి వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. తోటి జానపద నటి మాధురి రాథోడ్‌తో కలిసి వేములవాడలోని ఒక రెడ్డి భవన్‌లో ఉండగా ఈశ్వర్ సాయి భార్య వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈశ్వర్ సాయికి ఇప్పటికే వివాహమై, ఏడేళ్ల బాబు కూడా ఉన్నాడు. మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి కలసి పలు ఫోక్ సాంగ్స్‌లో నటించారు. ఈ పరిచయమే వారి మధ్య సంబంధానికి దారితీసిందని తెలుస్తోంది.ఈ ఘటనపై ఈశ్వర్ సాయి భార్య తీవ్ర భావోద్వేగానికి గురవుతూ మీడియా ముందు పలు సంచలన వ్యాఖ్యలు చేసింది:
మాకు పెళ్లై 7 ఏళ్లు అవుతోంది. నా భర్త కనీసం మందు కూడా తాగే వ్యక్తి కాదు, చాలా మంచివాడు. కానీ ఈ అమ్మాయే (మాధురి) అతని మీదపడి లొంగదీసుకుంది. అమ్మాయి అలా ప్రవర్తిస్తే అతను మాత్రం ఏం చేస్తాడు?అని పేర్కొంది.
ఆ అమ్మాయికి బ్రేకప్ అయినప్పుడు నేనే దగ్గరుండి ఓదార్చాను. నా పక్కనే ఉంటూ, మంచి అమ్మాయిలా నటిస్తూ నన్నే మోసం చేస్తుందని అనుకోలేదు. మొదట్లో మంచిది అనుకున్నాను కానీ, వారి ఫోన్ మెసేజ్‌లు చూసి కంగుతిన్నాను.ఈ దారుణమైన విషయం తెలిశాక తట్టుకోలేక ఒకసారి నా కొడుకుతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాను.ఇలాంటి అమ్మాయిలను ఫోక్ సాంగ్స్ పరిశ్రమలోకి రానివ్వకూడదు, ఇండస్ట్రీ నుంచి దూరంగా పెట్టాలి” అని ఆమె డిమాండ్ చేసింది.
Also Read:ఆల్ టైం క్లాసిక్ ..’గీతాంజలి’!

