ప్రిన్సిపాల్‌ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్

1
- Advertisement -

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జేబీ కాలనీలో పాఠశాల ప్రిన్సిపాల్ కల్లు రూపా రెడ్డి దారుణ హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేసును విచారించిన పోలీసులు అదే పాఠశాలకు చెందిన ముగ్గురు మైనర్లను అరెస్ట్ చేశారు.

పోలీసుల దర్యాప్తులో వెల్లడైన కీలక వివరాలు ప్రకారం, నిందితులైన ముగ్గురు మైనర్లు గంజాయికి తీవ్రంగా బానిసలయ్యారు. కొన్ని రోజుల క్రితం వీరు గంజాయి సేవిస్తుండగా ప్రిన్సిపాల్ రూపా రెడ్డికి దొరికిపోయారు. ఆ సమయంలో ఆమె వారి ఫోటోలు, వీడియోలను తన ఫోన్ లో రికార్డ్ చేశారు. ఆ ఫొటోలు, వీడియోలు బయటకు వస్తే తమ భవిష్యత్తు ఎక్కడ పాడవుతుందోనన్న భయంతో పాటు, ఆ ఆధారాలను తుడిచిపెట్టాలనే కుట్రతోనే నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

పక్కా ప్రణాళిక ప్రకారం హ్యాండ్ గ్లౌజులు, మాస్కులు ధరించి నిందితులు రూపా రెడ్డి ఇంట్లోకి చొరబడ్డారు. ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తపడిన నిందితులు, ఇంట్లోకి వెళ్లిన కేవలం 9 నిమిషాల వ్యవధిలోనే కత్తితో విచక్షణారహితంగా పొడిచి ఆమెను హత్య చేశారు. అనంతరం రూపా రెడ్డి ఐఫోన్ తో పాటు కొంత నగదును అపహరించి అక్కడ నుంచి పరారయ్యారు.

Also Read:ఆల్ టైం క్లాసిక్ ..’గీతాంజలి’!

సంచలనం సృష్టించిన ఈ హత్య కేసుపై ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ మరియు ఇతర సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ వేగవంతం చేశారు.

- Advertisement -