తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి నివేదిక విడుదల చేసింది ఎన్నికల సంఘం. 78.30% అంటే 2,64,87,213 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించినట్లు తెలిపింది.
9,22,229 మంది ఓటర్లు (2.73%) మృతిచెందిన వారిగా గుర్తించగా 57,46,803 మంది ఓటర్లు (16.99%) శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన, అందుబాటులో లేని లేదా ఇతర కేటగిరీల్లో ఉన్నట్లు తెలిపింది.
6,70,203 మంది ఓటర్లు (1.98%) ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటర్ల జాబితాలో నమోదైనట్లు గుర్తించగా నిజమైన ఓటర్లు మళ్లీ ఓటర్ల జాబితాలో చేరేందుకు ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాల ప్రక్రియలో ఫారం-6తో పాటు నిర్దేశిత డిక్లరేషన్ ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.
ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో నమోదైన ఓటర్ల పేర్లను ఒకే చోట కొనసాగించనున్నట్లు ఈసీ స్పష్టం చేయగా అక్టోబర్ 19వ తేదీన తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.


