బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గద్వాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుడు బాసు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంక్షేమ పథకాన్ని నిలిపివేసేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపిస్తూ, ఈ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
నిరసనలో భాగంగా నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి పాత బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. అనంతరం అక్కడి నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
Also Read:ఇరుముడి మంచి ఎమోషనల్ రైడ్!
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్. కేశవ్, మాజీ జెడ్పీటీసీ బాసు శ్యామల హనుమంతు నాయుడు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు మరియు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

