‘తగ్గేదే లే’, ‘7 అవర్స్ టు గో’, మరియు ‘గోస్ట్’ వంటి చిత్రాలలో నటించి గుర్తింపు పొందిన నటి అనన్య రాజ్ జూలై 15న నిద్రలోనే ప్రశాంతంగా కన్నుమూశారు అని ఆమె కుటుంబం ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది. ఆమె వయస్సు 35 సంవత్సరాలు.
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అనన్య రాజ్ గత ఏడాది కాలంగా “శారీరక మరియు మానసిక ఇబ్బందుల”తో పోరాడుతున్నట్లు ఆమె కుటుంబం తెలిపింది.మేము అనన్య కుటుంబ సభ్యులం. తీవ్రమైన దుఃఖంతో అనన్య జూలై 15 ఉదయాన్నే పరమపదించారని తెలియజేస్తున్నాము. ఆమె నిద్రలోనే ప్రశాంతంగా తుది శ్వాస విడిచారు. గత ఏడాది కాలంగా ఆమె శారీరక, మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాటిని అధిగమించడానికి ఆమె ఒక యోధురాలిలా పోరాడారు అని కుటుంబం ఆ ప్రకటనలో రాసుకొచ్చింది.
అనన్య రాజ్ మరణించి నెల రోజులు పూర్తయిన సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు ఆమె అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అంతిమ సంస్కారాలకు సంబంధించిన చిత్రాలను పంచుకున్నారు. దివంగత నటిని “మనోధైర్యం ఉన్న అమ్మాయి”గా అభివర్ణిస్తూ అనన్య రాజ్ ఒక రాణిలా జీవించిందని ఆమె కుటుంబం పేర్కొంది.
బచ్చా నీ లోటు ఎప్పటికీ తీరనిది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించాలని మీ అందరినీ కోరుతున్నాం. ఈ కష్ట సమయంలో మా గోప్యతను కాపాడాలని మరియు ప్రశాంతతను ఇవ్వాలని కోరుకుంటున్నాము” అని తెలిపారు.
Also Read:అక్టోబర్ 9న ‘కామ్రేడ్ కళ్యాణ్’
‘ది ఫైనల్ ఎగ్జిట్’ వంటి చిత్రాలతో పాటు, టి-సిరీస్ (T-Series), జీ మ్యూజిక్ (Zee Music), మరియు టైమ్స్ మ్యూజిక్ (Times Music) వంటి ప్రముఖ మ్యూజిక్ లేబుల్స్ అందించిన పలు మ్యూజిక్ వీడియోలలో కూడా అనన్య రాజ్ నటించారు.
View this post on Instagram

