‘ఫౌజీ’..త్యాగానికి నివాళి!

1
- Advertisement -

రెబెల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఫౌజీ’ డిసెంబర్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హను రాఘవపుడి దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ ననిర్మాణంలో టి-సిరీస్ సమర్పిస్తున్న ఈ భారీ పీరియడ్ యాక్షన్ చిత్రానికి నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, భూషణ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. టైటిల్ పోస్టర్ నుండి ప్రీ-లుక్, ఫస్ట్ లుక్ వరకు, ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

‘ఫౌజీ’ చిత్ర నిర్మాతలు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బలమైన భావోద్వేగ, చారిత్రక నేపథ్యం ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు. భారతదేశం నేడు జరుపుకుంటున్న స్వాతంత్ర్యం వెనుక ఉన్న త్యాగానికి నివాళిగా నిలిచిన ఈ పోస్టర్ అందరినీ కట్టిపడేసింది.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సాధారణంగా కనిపించే సంబరాలకు భిన్నంగా.. ఈ పోస్టర్ స్వాతంత్ర్యం వెనుక ఉన్న త్యాగం, పోరాటం, ధైర్యాన్ని గుర్తుచేస్తోంది. యుద్ధంతో ధ్వంసమైన ప్రాంతం, పొగలు, మంటలు, శిథిలాలు పోస్టర్‌లో కనిపిస్తుండగా.. దూరంలో చార్మినార్ ప్రత్యేకంగా కనిపిస్తోంది.

పోస్టర్‌లో ప్రభాస్ ముఖం కనిపించకపోయినా, ఆయన లుక్ మాత్రం పవర్ ఫుల్ ఉంది. రక్తం, మట్టితో నిండిన దుస్తులతో, గాయాలతో కనిపిస్తున్న ప్రభాస్.. రెండు చేతుల్లో రెండు చిన్న తుపాకులు పట్టుకుని, చెప్పులు లేకుండా ధ్వంసమైన వీధుల్లో నడుస్తున్నారు. ఆయనకు ముందుగా సంప్రదాయ భారతీయ దుస్తుల్లో మరో వ్యక్తి చేతిలో పొడవాటి కర్రతో నడుస్తూ కనిపించారు.

ఈ పోస్టర్ చూస్తే.. ఒక చారిత్రక యుద్ధం, హింసాత్మక పోరాటం మధ్యలో చిక్కుకున్న వ్యక్తి కథలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. “Before freedom became a celebration, it was a battle!” అంటూ మేకర్స్ ఇచ్చిన సందేశం పోస్టర్‌కు మరింత ఎమోషనల్ బలం చేకూర్చింది.

ఈరోజు మనం జరుపుకుంటున్న స్వాతంత్ర్యం వెనుక ఎన్నో ఏళ్ల పోరాటం, ధైర్యం, త్యాగం ఉన్నాయనే విషయాన్ని ఈ పోస్టర్ గుర్తుచేస్తోంది. “Saluting the spirit of every Fauzi who fought for our tomorrow” అంటూ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ప్రతి ఫౌజీకి నివాళి అర్పించారు.

ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రముఖ నటులు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భానుచందర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.సుదీప్ ఛటర్జీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు. అనిల్ విలాస్ జాదవ్ ప్రొడక్షన్ డిజైన్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్.తారాగణం: ప్రభాస్, ఇమాన్వి, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద, భాను చందర్.

ALso Read:రాత్రి పూట ఈ కూరగాయలు తింటే..!

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: హను రాఘవపూడి
నిర్మాత: మైత్రీ మూవీ మేకర్స్
సమర్పణ: గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ & T-సిరీస్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్, భూషణ్ కుమార్
DOP: సుదీప్ ఛటర్జీ ISC
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ప్రొడక్షన్ డిజైనర్: అనిల్ విలాస్ జాదవ్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
సాహిత్యం: కృష్ణకాంత్
కొరియోగ్రాఫర్: ప్రేమ్ రక్షిత్
కాస్ట్యూమ్ డిజైనర్లు: శీతల్ ఇక్బాల్ శర్మ, టి విజయ్ భాస్కర్
VFX: RC కమల కన్నన్
పబ్లిసిటీ డిజైనర్లు: అనిల్-భాను
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

- Advertisement -