అమెరికాలోని మెసాచుసెట్స్ రాష్ట్రంలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఆక్టన్ నగరంలో నివసిస్తున్న 17 ఏళ్ల అర్జున్ అరవింద్ అనే భారత సంతతికి చెందిన మైనర్ బాలుడు తన తల్లిని, 14 ఏళ్ల సొంత తమ్ముడిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘాతకానికి ఒడిగట్టడానికి ముందు నిందితుడు (AI) సాంకేతికత కలిగిన ‘చాట్‌జీపీటీ’ ని ఉపయోగించి హత్యలకు పథకం రచించినట్లు పోలీసులు విచారణలో వెల్లడించారు.
ఆగస్టు 11వ తేదీ (మంగళవారం) సాయంత్రం, ఇంట్లో ఉన్న భార్య సుధా వెంకటేశన్ (45), చిన్న కుమారుడు సిద్ధార్థ్ అరవింద్ (14) ఫోన్ కలవకపోవడంతో నిందితుడి తండ్రి ఆందోళనకు గురయ్యారు. ఉపాధ్యాయుడు (ట్యూటర్) ఇంటికి వచ్చినప్పటికీ లోపలి నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఆక్టన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీ చేయగా హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. ఇంట్లోని మొదటి అంతస్తులో తమ్ముడు సిద్ధార్థ్, బేస్‌మెంట్ (నేలమాళిగ)లో తల్లి సుధా వెంకటేశన్ మృతదేహాలు రక్తమడుగులో పడి ఉన్నాయి. మృతదేహాలపై తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
హత్యలు చేసిన అనంతరం నిందితుడు అర్జున్ అరవింద్, తన తల్లికి చెందిన హోండా కార్‌లో అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు వేగంగా స్పందించి గాలింపు చర్యలు చేపట్టగా మరుసటి రోజు (ఆగస్టు 12) వేలాండ్ సమీపంలోని ఒక పార్కింగ్ స్థలంలో ఉన్న కారులో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.
కేసు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు అర్జున్ అరవింద్ గత కొన్ని నెలలుగా విపరీతమైన మానసిక ప్రవర్తనను కనబరిచాడని పోలీసులు తెలిపారు. ఇంటర్నెట్ తో పాటు ChatGPT ఉపయోగించి కుటుంబ సభ్యులను ఎలా హత్య చేయాలి దానికి సంబంధించిన ఫాంటసీ కథనాలు, ప్లాన్ల గురించి శోధించినట్లు అధికారులు గుర్తించారు.
Also Read:హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు నివేదిక!
ప్రస్తుతం పోలీసులు నిందితుడిపై రెండు హత్య కేసులు, వాహన చోరీ, కుటుంబ సభ్యులపై దాడి తదితర తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన స్థానిక ప్రవాస భారతీయ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

