మంత్రి జూపల్లిని నిలదీసిన సర్పంచ్

1
- Advertisement -

మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఊహించని షాక్ తగిలింది. ముందు మీ సొంత ఊరు సంగతి చూసుకోండి అంటూ జూపల్లిని నిలదీశారు ఓ సర్పంచ్‌. మీకు వేరే ఊళ్లు అవసరం లేదు.. ముందు ఉన్న ఊరు, కన్నతల్లి.. ఫస్ట్‌ మీ సొంత ఊరు సంగతి చూసుకోండి.. పల్లెలను చూసుకోండి.. సార్‌ అంటూ మంత్రి జూపల్లికి రేకులపల్లి తండా సర్పంచ్ ప్రభాకర్ సూచించారు.

వనపర్తి జిల్లా ఎదుల మండలం సింగాయిపల్లిలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. రేకులపల్లి తండా సర్పంచ్ ప్రభాకర్ ఈ సందర్భంగా మంత్రి జూపల్లి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రేకులపల్లి తండా సర్పంచ్ ప్రభాకర్ మాట్లాడుతూ.. మీరు ఊరికి రాకపోవడం.. గ్రామాల్లో తిరగకపోవడం.. మీకు వేరే ఊళ్లు అవసరం లేదు.. ముందు ఉన్న ఊరు, కన్నతల్లి.. ఫస్ట్‌ మీ సొంత ఊరు సంగతి చూసుకోండి.. పల్లెలను చూసుకోండి.. సార్‌ అంటూ మంత్రి జూపల్లికి సూచించారు.

Also Read:డిలిమిటేషన్‌కు నో..సీఎం విజయ్ తీర్మానం

నేను మీకు ఫోన్ చేస్తున్నా కానీ మీ పీఏలు ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదు. అప్పుడు నేను కార్యకర్త మాత్రమే.. కానీ ఈ రోజు నేను 1500 మంది జనాభా ఉన్న గ్రామానికి సర్పంచ్‌ను. మీరు ఫోన్లు వాళ్ల దగ్గర పెడ్తరు. మా బాధలేంటో చెప్పుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నామన్నారు. తండాకు రోడ్లు దరిద్రంగా ఉన్నాయని.. సమస్యలు చెబుదామంటే పీఏలు ఫోన్లు ఎత్తడంలేదని, మీరు మళ్లీ ఊరికి ఎప్పుడు వస్తారో చెప్పాలంటూ మంత్రి జూపల్లిని నిలదీశారు.మంత్రి జూపల్లిని ప్రజలు, అధికారులందరి ముందే సర్పంచ్‌ ప్రభాకర్ నిలదీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -