భారత్‌తో ఆఫ్ఘాన్‌ టి20 సిరీస్

1
- Advertisement -

భారత క్రికెట్ అభిమానులకు ఒక ఆసక్తికరమైన వార్త. వచ్చే సెప్టెంబర్ 2026లో భారత క్రికెట్ జట్టుతో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడేందుకు ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) సన్నాహాలు చేస్తోంది. ఈ సిరీస్‌కు ఆఫ్ఘనిస్థాన్ ‘హోమ్’ బోర్డుగా వ్యవహరించనున్నప్పటికీ మ్యాచ్‌లన్నీ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనున్నట్లు బోర్డు వర్గాల సమాచారం.

ఆఫ్ఘనిస్థాన్‌లో అంతర్జాతీయ క్రికెట్ నిర్వహణకు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో, ఆ దేశ బోర్డు సుదీర్ఘకాలంగా భారతదేశంలోని మైదానాలనే తమ ‘హోమ్ గ్రౌండ్’గా ఉపయోగిస్తోంది. గ్రేటర్ నోయిడా, డెహ్రాడూన్, లక్నోల తర్వాత ఈసారి ఢిల్లీ వేదికగా టీమిండియాతో ద్వైపాక్షిక సిరీస్ నిర్వహించాలని నిర్ణయించారు.

సెప్టెంబర్‌లో జరగనున్న ఈ టి20 సిరీస్‌కు బిసిసిఐ (BCCI) మరియు ఆఫ్ఘనిస్థాన్ బోర్డులు పరస్పర అంగీకారం తెలిపాయి. భారత జట్టుతో మ్యాచ్‌లు ఆడటం ద్వారా ఆఫ్ఘన్ ఆటగాళ్లకు మంచి అనుభవం లభించడంతో పాటు, రెండు దేశాల క్రికెట్ సంబంధాలు మరింత బలపడతాయని భావిస్తున్నారు. మూడు టి20ల మ్యాచ్ ల తేదీలు, ప్రసార వివరాలు మరియు పూర్తి స్థాయి షెడ్యూల్‌ను బోర్డు అతి త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. టి20 ప్రపంచకప్ విజయం తర్వాత భారత జట్టు వరుస ద్వైపాక్షిక సిరీస్‌లతో బిజీగా ఉంది.

Also Read:పెద్ద మనసుతో క్షమించండి:జానీ మాస్టర్

ఈ సిరీస్‌లో భారత సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి, యువ ఆటగాళ్లతో కూడిన జట్టును బరిలోకి దింపే అవకాశాలు ఉన్నట్లు క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -