మొన్నటి వరకూ సన్నీ లియోన్ ప్రెగ్నెంట్ అనే రూమర్లు వినిపించాయి. అయితే ఆ వార్తలు నిజం కావని సన్నీ దంపతులు స్పష్టం చేశారు. ఇంతలోనే సన్నీ లియోన్ తల్లి అయ్యారు. ఒక బిడ్డకు జన్మను ఇవ్వకపోయినా… ఒక బిడ్డకు జీవితాన్ని ఇస్తూ సన్నీ తల్లి అయ్యింది. ఒక పాపను దత్తత తీసుకుని ఆమె ‘అమ్మ’అయ్యింది.
మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి చెందిన 21 నెలల వయసున్న పాపను సన్నీ-వెబర్ దంపతులు దత్తత తీసుకున్నారు. పాపకి నిషా కౌర్ వెబర్ అని పేరు పెట్టినట్లు పేర్కొంది. సన్నీ అసలు పేరు కరణ్‌జీత్ కౌర్ వోరా. దాంతో తన పేరులోని కౌర్.. భర్త పేరులోని వెబర్ పదాలు కలిసేలా పాపకు పేరు పెట్టారు.
సన్నీ దత్తత తీసుకోవడంపై పలువురు సెలబ్రిటీలు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. కొందరు నెటిజన్స్ మాత్రం సోషల్ మీడియాలో సన్నీపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. చిన్నారిని ఎలా దత్తత తీసుకుందని, ఈ విషయంలో ప్రభుత్వం సన్నీకి ఎలా పర్మీషన్ ఇచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. పోర్న్ స్టార్ అయిన సన్నీ చిన్నారిని కూడా పోర్న్ స్టార్ గా మారిస్తే పరిస్థితేంటి అని కొందరు వాపోతున్నారు. అయితే నెటిజన్స్ కామెంట్స్ పై సెలబ్రిటీలు ఫైర్ అయ్యారు. ఒక అనాధని చేరదీసి ఆమెకి మంచి లైఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతో వారు దత్తత తీసుకుంటే ఇలా తప్పుడు మాటలతో ఎదుటివారిని కించపరడం ఏ మాత్రం సబబు కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
21 నెలల చిన్నారిని సన్నీ దంపతులు మహార్ష్రా్టలోని లాతూరుకి చెందిన ఓ అనాథాశ్రమం నుంచి దత్తత తీసుకున్నారు. మరి నెటిజన్స్ కామెంట్స్ పై సన్నీ ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.