క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సంచలన చిత్రం ‘ఖడ్గం’ తనకు ఎంతగానో ప్రత్యేకమైనదని హీరో శ్రీకాంత్ వెల్లడించారు. దేశభక్తి నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా తన నటనా జీవితంలో మైలురాయిగా నిలిచిందని ఎంతగానో ప్లస్ అయిందని ఆయన గుర్తు చేసుకున్నారు.
రవితేజ, ప్రకాష్ రాజ్ పాత్రలు అద్భుతం …సినిమా అనుభవాలను పంచుకుంటూ శ్రీకాంత్ పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. చిత్రంలో మాస్ మహారాజా రవితేజ, బహుముఖ నటుడు ప్రకాష్ రాజ్ పోషించిన పాత్రలు ఎంతో అద్భుతంగా ఉంటాయని, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయని ప్రశంసించారు.
ఈ చిత్రంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ‘నువ్వే నువ్వే’ పాట తన ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ అని శ్రీకాంత్ స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగష్టు 15న ‘ఖడ్గం’ చిత్రాన్ని బిగ్ స్క్రీన్స్‌పై రీ-రిలీజ్ చేయబోతున్నారు.
Also Read:ఇరాన్ ప్రతిపాదనకు ట్రంప్ నో!
ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ అభిమానులకు, ప్రేక్షకులకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. “దేశభక్తి స్ఫూర్తిని రగిల్చే ఈ సినిమాను థియేటర్లలో మళ్లీ చూసి అందరూ ఎంజాయ్ చేయాలని” కోరారు. రీ-రిలీజ్ సందర్భంగా చిత్రబృందం థియేటర్లలో ప్రత్యేక హంగామాకు ఏర్పాట్లు చేస్తోంది.

