ఛార్మీ మా కొంప ముంచింది..!

187
- Advertisement -

ప్రస్తుతం టాలీవుడ్‌ని షేక్‌చేస్తున్న డ్రగ్స్‌ అంశంలో ప్రముఖుల పేర్లు బయటికి రావడం సంచలనంగా మారింది. రోజుకొకరిని విచారిస్తున్న సిట్‌ ప్రముఖంగా వినిపించిన పేరు పూరీ జగన్నాథ్‌తో విచారణ ప్రారంభించింది.బుధవారం నాడు సిట్ ముందు విచారణకు హాజరైన పూరీ జగన్నాథ్ పూర్తిగా పోలీసులకు సహకరించినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ తీసుకున్న తాను సరదాగా ఛార్మీ, ముమైత్ ఖాన్ కు ఇచ్చినట్టు తెలిపాడని.. అలాగే మరికొందరు సరదాగా డ్రగ్స్ తీసుకున్నట్టు చెప్పాడని సమాచారం..

ఇదిలా ఉండగా తన భర్త మత్తుమందుల కేసులో ఇరుక్కోవడానికి హీరోయిన్ చార్మీయే కారణమని దర్శకుడు పూరీ భార్య లావణ్య బాధపడినట్టు తెలిసింది.. పూరీ డ్రగ్స్‌ వ్యవహారంలో ఇరుక్కోవడంతో పలు సినీ పరిశ్రమ పెద్దలు పూరీ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లినపుడు లావణ్య పరిశ్రమ పెద్దల వద్ద బాధపడ్డారట. వారి వద్ద కన్నీటిపర్యంతమైన లావణ్య, చార్మీతో ఉన్న అనుబంధం కారణంగానే తన భర్త ఫెయిల్యూర్ల బాటలో ఉన్నాడని, ఆర్థికంగా దెబ్బతిని, సర్వనాశనం కావడానికి కూడా ఆమే కారణమని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఛార్మీతో కలవద్దని చెప్పినందుకు ఇంటికి రావడం కూడా మానేశాడని లావణ్య వాపోయిందట.

Puri jagannadh charmee

చార్మి సోదరులకు పంజాబ్ లోని డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్నాయని సంచలన ఆరోపణలు చేసిందని సమాచారం.. డ్రగ్స్ దందాల విషయంలో చార్మి సోదరులను విచారించేందుకు హైదరాబాద్ పోలీసులు పంజాబ్ కు వెళ్లాలని కూడా ఆమె కోరినట్టు తెలుస్తోంది. తన భర్తను వాడుకుంటూ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు చార్మి యత్నించిందని ఆరోపించింది. మొత్తంగా ఛార్మీ తమ కొంప ముంచిందని పెద్దలతో గోడు వెళ్లబోసుకున్నట్లు తెలిసింది.. ఇంత రాద్ధాంతం అవుతున్నా, తన కుటుంబ జీవితం చెడిపోరాద్దన్న ఉద్దేశంతో భర్తను ఒక్క మాట కూడా అనలేదని లావణ్య చెప్పినట్టు సమాచారం. ఇప్పుడు లావణ్య వ్యాఖ్యలు టాలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి. అయితే సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పిన పూరీ జగన్నాధ్‌.. మళ్లీ వారెప్పుడు పిలిచినా వెళ్తానని పేర్కొన్నారు.

- Advertisement -