SIR:తెలంగాణలో 60 లక్షల ఓట్లు కట్?

2
- Advertisement -

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ముగిసేసరికి రాష్ట్ర ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ఎన్నికల అధికారుల అంచనా వేస్తున్నారు. ప్రాథమిక వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60 లక్షల ఓట్లను తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దాదాపు 40 లక్షల మంది ఓటర్లు నమోదు చేసుకున్న అడ్రస్‌లలో అందుబాటులో లేరని ఇతర ప్రాంతాలకు లేదా నగరాలకు శాశ్వతంగా మారిపోయారని అధికారులు గుర్తించారు. చనిపోయినవారు, తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు కలిగి ఉన్నవారు…ఒకే రాష్ట్రంలో రెండు లేదా మూడు చోట్ల పేర్లు నమోదైనవారు కలిపి మరొక 20 లక్షల మంది వరకు ఉన్నట్లు అంచనా.

ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ద్వారా ఓటర్ల జాబితాలో పేరున్న ప్రతి ఒక్కరి వివరాలను బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLO) ఇంటింటికీ వెళ్లి సరిచూశారు. బోగస్ ఓట్లను తొలగించి పారదర్శకమైన తుది జాబితాను తయారు చేయడం… ఒకే వ్యక్తికి వేర్వేరు నియోజకవర్గాల్లో లేదా పొరుగు రాష్ట్రాల్లో ఉన్న డబుల్ ఓట్లకు చెక్ పెట్టడం.

కేవలం అర్హత కలిగిన ప్రామాణిక ఓటర్లకు మాత్రమే తుది జాబితాలో స్థానం కల్పించడం ప్రధాన ఉద్దేశం. ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేసి నిర్ణీత గడువులోగా ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే ఈ ఓట్లను తొలగిస్తారు. నిజమైన ఓటర్లు ఎవరైనా పొరపాటున తమ ఓటు కోల్పోకుండా ఉండేందుకు ECI అధికారిక పోర్టల్ లేదా Voter Helpline App ద్వారా తమ ఓటు స్థితిని (Voter Status) ముందే సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Also Read:ఎర్రసముద్రంలో భారత నౌకపై దాడి

- Advertisement -