శ్రీలంక టూర్‌..భారత బ్యాటర్లు కసరత్తు!

1
- Advertisement -

శ్రీలంక టూర్‌లో భాగంగా ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. విదేశీ పర్యటనలకు వెళ్లే ముందు ఆటగాళ్లు వ్యక్తిగతంగా ప్రాక్టీస్ చేయడం సాధారణమే అయినప్పటికీ వీరిద్దరూ పూర్తిగా స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొవడంపైనే దృష్టి పెట్టడం విశేషం.

శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌లో స్పిన్నర్లదే కీలక పాత్ర కానుండటంతో, సాధారణంగా కొత్త బంతితో పేస్ బౌలింగ్‌ను ప్రాక్టీస్ చేసే ఈ ఓపెనర్లు, ఈసారి అన్ని రకాల స్పిన్నర్లను (లెఫ్ట్ ఆర్మ్, లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్) ఎదుర్కొన్నారు. ముంబై రంజీ దిగ్గజం తనుష్ కొటియాన్‌తో సహా పలువురు స్థానిక స్పిన్నర్లు వీరికి బౌలింగ్ చేశారు.

శ్రీలంక పర్యటనకు ప్రధాన జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ముంబై ఆఫ్ స్పిన్నర్ తనుష్ కొటియాన్, విదర్భ స్పిన్నర్ హర్ష్ దూబేలతో పాటు విప్రాజ్ నిగమ్ (లెగ్ స్పిన్), శివాంగ్ కుమార్ (లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్)లను సెలెక్టర్లు నెట్ బౌలర్లుగా ఎంపిక చేశారు. శ్రీలంకలో భారత బ్యాటర్లకు అన్ని రకాల స్పిన్ వైవిధ్యాలను ప్రాక్టీస్ చేయించేందుకు వీరిని జట్టుతో పాటు తీసుకెళ్తున్నారు. ఇప్పటికే ప్రధాన జట్టులో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, సారాంశ్‌ జైన్ వంటి స్పిన్నర్లు ఉన్నారు.

టూర్ షెడ్యూల్:

3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్: ఆగస్టు 7 నుండి (కొలంబో)

మొదటి టెస్టు: ఆగస్టు 15 – 19 (గాల్)

రెండో టెస్టు: ఆగస్టు 23 – 27 (కొలంబో)

Also Read:అశ్విన్‌కు ‘సారీ’ చెప్పిన అర్ష్‌దీప్!

- Advertisement -