- Advertisement -
అంతర్జాతీయ టోర్నమెంట్లలో మన రాష్ట్ర ఆటగాళ్ల ప్రాతినిథ్యం పెరుగుతున్నది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుంటూ రాష్ర్టానికి చెందిన బధిర ఆటగాళ్లు పర్వతనేని సాయితేజ, మహ్మద్ సమీవుల్లాలు అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్‌కు ఎంపికయ్యారు. వీరిద్దరు ఈనెల 24నుంచి గ్రీస్ దేశంలో జరిగే అంతర్జాతీయ బధిర క్రికెట్ చాంపియన్‌షిప్ లో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కించుకున్నారు.
ఈ టోర్నీ వచ్చేనెల 6వరకు జరుగనుంది. ఈ సందర్భంగా సాయితేజ, సమీవుల్లాను క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అభినందించారు. గ్రీస్ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో సత్తాచాటాలని క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన ఆటగాళ్లతో సీఎం కేసీఆర్ అన్నారు. ఆల్ ఇండియా క్రికెట్ అసోసియేషన్ హైదరాబాద్ లో వీరిని ఎంపిక చేయడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
- Advertisement -