కుంటాలకు పోటెత్తిన పర్యాటకులు

1
- Advertisement -

భారీ వర్షాలతో కుంటాల జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రకృతి అందాలకు పర్యాటకులు ఫిదా అవుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నిర్మల్ జిల్లాలోని కుంటాల జలపాతం జలకళను సంతరించుకుంది.

భారీగా నీటి ప్రవాహం పెరగడంతో తెలంగాణలోనే అత్యంత ఎత్తైన ఈ జలపాతం కనువిందు చేస్తోంది. వర్షాకాలంలో కుంటాల జలపాతం అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తోంది పోచెర జలపాతం. నిర్మల్ జిల్లాలో పూర్తి స్థాయిలో జాలువారుతోంది పోచెర జలపాతం. కడెం నదికి ఉపనదైన పోచెర వాగుపై కనువిందు చేస్తోంది జలపాతం. జలపాతం అందాలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తుండగా అప్రమత్తంగా ఉండాలని పర్యాటకులకు అధికారులు సూచిస్తున్నారు.

Also Read:దుల్కర్..’ఐ యామ్ గేమ్’

- Advertisement -