భద్రాచలం..మొదటి ప్రమాద హెచ్చరిక

1
- Advertisement -

ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతూ 43 అడుగులకు చేరుకోవడంతో నీటిపారుదల శాఖ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వాసులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది.

ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో గోదావరి ఉధృతి ఇంకా కొనసాగుతోంది. 43 అడుగులుమొదటి ప్రమాద హెచ్చరిక,48 అడుగులు రెండవ ప్రమాద హెచ్చరిక సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంది. ఇక వరద 53 అడుగులకు చేరితే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు.

వరద ప్రభావం గరిష్టంగా 50 అడుగుల వరకు చేరి, ఆ తర్వాత మెల్లగా తగ్గుముఖం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. వరద పెరుగుతున్న నేపథ్యంలో భద్రాచలం డివిజన్ వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ, పోలీస్, నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయంతో సహాయక చర్యలకు సిద్ధమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలి. గోదావరి స్నాన ఘట్టాల వద్దకు ఎవరూ వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాం. అత్యవసరం అయితే తప్ప ఇంట్లోంచి బయటకు రాకూడదు అని అధికారులు సూచించారు.

Also Read:ఇంజినీర్లను అవమానిస్తారా?

- Advertisement -