టాలీవుడ్లో ఇప్పుడు డ్రగ్స్ కేసు సంచలనం రేపుతోంది. ఇండస్ట్రీలోని పలువురు నిర్మాతలు, దర్శకులు, నటీనటులు డ్రగ్స్ తీసుకుంటున్నారన్న వార్తలతో టాలీవుడ్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే ఇప్పటికే డ్రగ్స్ వ్యవహారంలో సినీ ప్రముఖులను సిట్ విచారించడం స్టార్ట్ చేసింది.
ఇదిలావుంటే, తాజాగా డ్రగ్స్ వ్యవహారంపై నటుడు ప్రకాశ్ రాజ్ తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యాడు. డ్రగ్స్ కేసులో మీడియా అత్యుత్సాహం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు.
ఇంకా విచారణ పూర్తి కాకుండానే, నిజాలు బయటకు రాకుండానే మీడియా ఎందుకు సంచలనం సృష్టిస్తోందని ప్రశ్నించారు. ఇప్పటికైనా మీడియా, ప్రజలు మేల్కొనాలన్నారు.
.
డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న వారిని ఒక్కొక్కరిని కార్యాలయానికి పిలిచి సిట్ అధికారులు విచారిస్తున్నారు. నిన్న ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ను అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఆయన ఇచ్చిన సమాధానాల ఆధారంగా ఇవాళ శ్యామ్ కె.నాయుడును విచారించారు.