అంతర్జాతీయ క్రికెట్‌కు రహానే గుడ్‌బై

4
- Advertisement -

భారత క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. టీమ్‌ఇండియా సీనియర్ బ్యాటర్, మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్‌లోని అన్ని అంతర్జాతీయ ఫార్మాట్ల (టెస్టులు, వన్డేలు, టి20లు) నుంచి వైదొలుగుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

భారత జెర్సీని ధరించి దేశానికి ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలో అత్యంత గౌరవప్రదమైన విషయం. ఈ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన నా కుటుంబ సభ్యులకు, బీసీసీఐ (BCCI), సహచర ఆటగాళ్లకు మరియు కోట్లాది మంది అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు రహానే.

టీమ్‌ఇండియా సాధించిన అనేక మరపురాని విజయాల్లో రహానే కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా విదేశీ పిచ్‌లపై భారత జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు క్రిజ్ లో నిలబడి జట్టును గట్టెక్కించడంలో రహానే దిట్ట. అందుకే ఆయనను అభిమానులు మరియు విశ్లేషకులు ‘మిస్టర్ డిపెండబుల్’ అని పిలుచుకునేవారు.
2020-21 బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ గైర్హాజరీలో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రహానే…మెల్‌బోర్న్ టెస్టులో అద్భుత సెంచరీ బాది సిరీస్ విజయంలో ముఖ్య భూమిక పోషించారు.

భారత్ తరఫున 85 టెస్టులు ఆడిన రహానే 5,000 పైగా పరుగులు సాధించారు. ఇందులో 12 సెంచరీలు, 26 అర్ధసెంచరీలు ఉన్నాయి. 90 వన్డేల్లో 2,962 పరుగులు, 20 టి20 మ్యాచ్‌లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.

Also Read:చైనా తీరుపై ట్రంప్ అసంతృప్తి!

- Advertisement -