కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత బృందం తమ మొదటి పతకాన్ని సాధించింది. పారా పవర్ లిఫ్టింగ్ పురుషుల హెవీవెయిట్ విభాగంలో జంధూ కుమార్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలుచుకుని, భారత్‌కు తొలి పతకాన్ని అందించారు.
72.4 కిలోల విభాగంలో పోటీ పడిన జంధూ కుమార్ తన రెండవ ప్రయత్నంలో 190 కిలోల బరువును ఎత్తారు. అయితే మూడో ప్రయత్నంలో 196 కిలోల బరువును ఎత్తడంలో విఫలమయ్యారు. చాలా సమయం రేసులో ముందంజలో ఉన్నప్పటికీ 28 ఏళ్ల ఈ అథ్లెట్ చివరకు మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
పోలియోను ఎన్నో ఆర్థిక కష్టాలను జంధూ కుమార్ జయించడం గమనార్హం. ఆయన మొత్తం 130.9 పాయింట్లు సాధించారు. 181 కిలోలు మరియు 190 కిలోల బరువులను విజయవంతంగా ఎత్తిన ఆయన, చివరగా 196 కిలోల విభాగంలో విఫలమయ్యారు. కాంస్యం సాధించినప్పటికీ, ఆయన బృందం స్వర్ణ పతకం వస్తుందని ఆశించింది.
మరోవైపు, లైట్‌వెయిట్ పారా పవర్ లిఫ్టర్ పతక అవకాశాన్ని చేజార్చుకున్నారు. పురుషుల ఫైనల్స్‌లో అశోక్ 143.8 పాయింట్లు సాధించి నాల్గో స్థానంలో నిలిచారు. అలాగే పరమ్‌జీత్ కుమార్ 7వ స్థానంతో సరిపెట్టుకున్నారు. మహిళల లైట్‌వెయిట్ విభాగంలో జస్ప్రీత్ కౌర్ 100 కిలోల బరువును ఎత్తి ఆరో స్థానంలో నిలిచారు.
Also Read:అసిడిటీనా లేక కిడ్నీ రాళ్ల సమస్యా?
కామన్వెల్త్ గేమ్స్‌లో ఈ విజయం తర్వాత, జంధూ కుమార్ కోచ్ రాజిందర్ సింగ్ రహేలు మాట్లాడారు. తాము పసిడి పతకాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని, అయితే తమ మధ్య జరిగిన చిన్న కమ్యూనికేషన్ లోపం మరియు తప్పుడు అంచనా వల్ల కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని చెప్పారు.

