ఆంధ్రప్రదేశ్ రాజకీయం అనగానే గుర్తొచ్చే మొదటి పేరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. 76 ఏళ్ల వయసులోనూ ఆయన చూపించే పని రాక్షసత్వం, ఉత్సాహం నవతరం నాయకులకు కూడా అబ్బురపరుస్తుంటాయి. ఈ క్రమంలోనే ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తన తండ్రి చంద్రబాబు నాయుడు పనితీరు, ఆయన క్రమశిక్షణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మా నాన్న చంద్రబాబు నాయుడికి ఒక్క రోజు జ్వరం వచ్చి ఇంట్లో పడుకున్న రోజు నాకు గుర్తు లేదు” అని లోకేశ్ పేర్కొన్నారు. 76 ఏళ్ల వయసులోనూ ఆయన ఎంతో చురుగ్గా పనిచేస్తారని నిరంతరం ప్రజాసేవకే తన సమయాన్ని కేటాయిస్తారని చెప్పారు.
తన తండ్రి పనితీరు గురించి లోకేశ్ మాట్లాడుతూ… ఆయన ఎప్పుడైనా అలసటగా ఉందని చెప్పడం నేను ఇంతవరకు చూడలేదు. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. నాతో మాట్లాడే ప్రతిసారీ ప్రజల కోసం ‘కష్టపడాలిరా’ అని నిరంతరం ప్రోత్సహిస్తుంటారు అని లోకేశ్ వివరించారు.
Also Read:‘418’..రిలీజ్ డేట్ ఫిక్స్!
వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని చంద్రబాబు తన దినచర్య ద్వారా నిరూపిస్తుంటారని ఆయన పాటించే ఆహార నియమాలు, వ్యాయామం మరియు పనిపట్ల ఉండే నిబద్ధతే ఆయనకు ఈ వయసులోనూ ఆ శక్తిని ఇస్తున్నాయని విశ్లేషకులు భావిస్తుంటారు. రాజకీయంలో దశాబ్దాల అనుభవం ఉన్నప్పటికీ ఇప్పటికీ సరికొత్త విజన్‌తో, యువకుడిలా శ్రమిస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో ఆయన చూపే చొరవ నిజంగా స్పూర్తిదాయకమని నాయకులు కొనియాడుతున్నారు.మంత్రి లోకేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ వైరల్‌గా మారాయి.

