2024 సంవత్సరానికి గాను ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ‘కల్కి 2898 ఏడీ’ రెండు విభాగాల్లో జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. ‘ఉత్తమ ప్రజాదరణ పొందిన సంపూర్ణ వినోదాత్మక చిత్రం’ విభాగంలో ‘కల్కి 2898 ఏడీ’ జాతీయ అవార్డుకు ఎంపికైంది.
అలాగే ‘ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్’ విభాగంలో ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి పనిచేసిన నితిన్ జిహానీ చౌదరి జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు.
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ రూపొందిన సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలతో ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకోవడంతో చిత్ర బృందానికి ప్రేక్షకులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Also Read:అంబటిపై గల్లా పరువునష్టం దావా!

