కేంద్రమంత్రి కుమారస్వామితో కేటీఆర్‌ భేటీ

5
- Advertisement -

కేంద్ర భారీ పరిశ్రమలు,ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి ఢిల్లీలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆదిలాబాద్ సీసీఐ యూనిట్‌ను వెంటనే తిరిగి ప్రారంభించి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే మైనింగ్ లీజ్‌ను పొడిగించాలి. రూ.2,000 కోట్ల పెట్టుబడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో రూ.250 కోట్లు సమకూర్చితే ప్లాంట్‌ను తిరిగి ప్రారంభించడం సాధ్యమవుతుంది అన్నారు.

ప్లాంట్ పునరుద్ధరణతో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 6,000 మందికి ఉపాధి లభిస్తుంది.డీసీసీఐ సాధన సమితి నాలుగేళ్లుగా నిరంతర పోరాటం చేస్తోంది.6. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సిర్పూర్ పేపర్ మిల్లును పునరుద్ధరించినట్లే సీసీఐని కూడా పునరుద్ధరించవచ్చని బీఆర్ఎస్ పేర్కొంది. సీసీఐ పునరుద్ధరణ జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజలతో కలిసి పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేసింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం ప్యాకేజ్ ఇచ్చినట్లే ఆదిలాబాద్ సీసీఐకి కూడా ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్ చేసింది అన్నారు.

రాజకీయాలను పక్కనపెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సీసీఐ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కోరింది.రైతులు “మా రక్తం తీసుకోండి… కానీ మా పొలాలకు నీళ్లు ఇవ్వండి” అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.సూర్యాపేట జిల్లాలో రైతులు రక్తదానంతో ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నారని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల ఆవేదనను గుర్తించి వెంటనే స్పందించాలని కోరారు.

ఎన్డీఎస్‌ఏ (NDSA) ప్రభుత్వాన్ని నియంత్రించే సంస్థ కాదని, అది కేవలం అడ్వైజరీ, రెగ్యులేటరీ సంస్థ మాత్రమేనని పేర్కొన్నారు.ఎన్డీఎస్‌ఏ పేరుతో రాజకీయాలు చేయవద్దని ముఖ్యమంత్రికి సూచించారు. వెంటనే కన్నెపల్లి పంపులను ప్రారంభించి తెలంగాణకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇరిగేషన్ ఇంజినీర్లు, రిటైర్డ్ ఇంజినీర్లు, రైతులు, అన్ని పార్టీల నాయకులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. నీళ్లు విడుదల చేస్తే తెలంగాణ కరువు పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం ఉందన్నారు.ప్రభుత్వ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం (Criminal Negligence) వల్లే రాష్ట్రానికి నష్టం జరుగుతోందని ఆరోపించారు.ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు.

Also read:పిల్లల కోసం పోషకాలతో కూడిన లంచ్ బాక్స్!

- Advertisement -