పిల్లల కోసం పోషకాలతో కూడిన లంచ్ బాక్స్!

2
- Advertisement -

వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు మళ్లీ ప్రారంభం కావడంతో, తల్లులందరికీ ప్రతిరోజూ ఉదయాన్నే ఎదురయ్యే అతిపెద్ద సవాలు . ఈ రోజు పిల్లల లంచ్ బాక్స్‌లో ఏం పెట్టాలి?”. పిల్లలు ఇష్టంగా తినాలి, అదే సమయంలో వారికి రోజంతా సరిపడా శక్తిని, పోషకాలను అందించే ఆహారం అయి ఉండాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంచుతూ, ఇంట్లోనే సులువుగా తయారుచేయగల కొన్ని పోషకాలతో కూడిన హెల్తీ టిఫిన్ ఇలా చేసుకోండి.

వెజిటెబుల్ మరియు పనీర్ కాథీ రోల్స్..పిల్లలకు చపాతీలు విడిగా పెడితే బోర్ కొడుతుంది. అందుకే గోధుమ పిండితో చేసిన చపాతీలో క్యారెట్, క్యాప్సికం, క్యాబేజీ మరియు పనీర్ ముక్కలను కొద్దిగా వేయించి స్టఫింగ్‌లా పెట్టి రోల్ లాగా చేసి ఇవ్వచ్చు. దీనివల్ల పిల్లలకు కార్బోహైడ్రేట్లు, విటమిన్లు మరియు పనీర్ ద్వారా అవసరమైన ప్రొటీన్లు అందుతాయి. తినడానికి కూడా ఇది చాలా రుచిగా, సులువుగా ఉంటుంది.

మల్టీగ్రెయిన్ వెజ్ ఉప్మా లేదా పోహా…సాధారణ బొంబాయి రవ్వ ఉప్మాకు బదులుగా గోధుమ రవ్వ లేదా ఓట్స్‌తో చేసిన ఉప్మా, అలాగే అటుకుల ఉప్మా (పోహా) పిల్లలకు మంచి ఆప్షన్. ఇందులో బఠానీలు, బంగాళాదుంపలు, క్యారెట్ ముక్కలు మరియు వేరుశనగ పప్పులు చేర్చాలి.ఇది తేలికగా జీర్ణమవుతుంది. రోజంతా పిల్లలు చురుగ్గా ఉండటానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, ఫైబర్ దీని ద్వారా లభిస్తాయి.

స్టఫ్డ్ పరాటాలు..పిల్లలు ఆకుకూరలు తినడానికి ఇష్టపడనప్పుడు, గోధుమ పిండిని కలిపేటప్పుడే అందులో పాలకూర (Spinach) ప్యూరీని లేదా మెంతికూర (Methi) ఆకులను కలిపి పరాటాలు చేయవచ్చు. లేదా ఆలూ స్టఫింగ్ పెట్టవచ్చు.ఆకుకూరల్లో ఉండే ఐరన్, కాల్షియం మరియు ఇతర మైక్రోన్యూట్రియెంట్స్ పిల్లల శరీరానికి అందుతాయి.

మిక్స్డ్ వెజిటెబుల్ పులావ్ లేదా ఫ్రైడ్ రైస్..మధ్యాహ్న భోజనంలో రైస్ ఇష్టపడే పిల్లల కోసం బ్రౌన్ రైస్ లేదా సాధారణ బాస్మతి రైస్‌తో రకరకాల కూరగాయలు వేసి పులావ్ చేయవచ్చు.కూరగాయలను విడిగా తినని పిల్లలు రైస్‌లో కలిపి చేసినప్పుడు ఇష్టంగా తింటారు. ఇది కడుపు నిండుగా ఉంచుతుంది.

మినీ ఇడ్లీలు మరియు దోసెలు …సాధారణ బియ్యం పిండితో కాకుండా రాగి (Ragi) లేదా జొన్న పిండితో చిన్న చిన్న సైజుల్లో ఇడ్లీలు లేదా దోసెలు చేసి స్కూల్ బాక్స్‌లో పెట్టవచ్చు. వీటికి తోడుగా ఇంట్లో చేసిన టమోటా పచ్చడి లేదా క్యారెట్ చట్నీ ఇవ్వచ్చు.రాగులలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకల బలానికి ఎంతో దోహదం చేస్తుంది.

Also Read:‘మిస్టర్ మిడిల్ క్లాస్’..ఎంజాయ్ చేస్తారు!

టిఫిన్ బాక్స్‌తో పాటు అదనంగా పెట్టాల్సిన స్నాక్స్..ఆపిల్ ముక్కలు, అరటిపండు, ద్రాక్ష లేదా దానిమ్మ గింజలను ఒక చిన్న బాక్స్‌లో విడిగా పెట్టండి. బాదం, జీడిపప్పు, కిస్‌మిస్ లేదా వాల్‌నట్స్‌ వంటివి రోజూ కొన్ని ఇవ్వడం వల్ల పిల్లల మెదడు పనితీరు (Brain Development) మెరుగవుతుంది. మజ్జిగ లేదా ఇంట్లో చేసిన జ్యూస్: ప్యాకెట్ జ్యూస్‌లకు బదులుగా ఇంట్లోనే నిమ్మరసం లేదా కొద్దిగా ఉప్పు, కొత్తిమీర వేసిన చల్లటి మజ్జిగను బాటిల్‌లో పోసి ఇవ్వడం వల్ల ఎండ తీవ్రతకు పిల్లలు డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటారు.

- Advertisement -