100 కొరడా దెబ్బలు కాదు.. 98 దెబ్బలే.. అనేది చంద్రబాబు సిద్ధాంతం అన్నారు మాజీ సీఎం జగన్. భీమవరంలో ఆక్వా రైతులతో మాట్లాడిన జగన్.. నాలుగు నెలల్లో కేజీకి 14-16 రూపాయల ధరలు పెంచి.. ముష్టివేసినట్టుగా రూ.2 తగ్గించారు అన్నారు. ఇష్టానుసారంగా ధరలు పెంచితే ఆక్వా రైతులు ఎలా బతకాలి చెప్పాలన్నారు.
ఇది ఆక్వా రంగానికి చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో …5 వేల టన్నులకు కోల్డ్ స్టోరేజ్ అన్నాడు కట్టాడా..?, ఉచిత కరెంట్ అన్నాడు ఇచ్చాడా..?.. మీ కష్టాలు నాకు తెలుసు.. మీ అందరికీ నేను ఉన్నాను అన్నారు. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే మరో మూడు సంవత్సరాలు కూడా పోతాయి…ముఖ్యమంత్రి చైర్మన్ గా కూర్చుంటాడు ఈ సిండికేట్ ను కూకటివేళ్లతో సహా నరికేస్తాడు అని స్పష్టం చేశారు జగన్.
చంద్రబాబు సీఎం కుర్చీలోకి వస్తే సిండికేట్‌కు పండగే.. పండగ..ఆక్వా రైతన్నకు మాత్రం కన్నీళ్లు.. ఇలాంటి దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది…- మాజీ సీఎం వైఎస్ జగన్ చంద్రబాబు సిండికేట్ రాష్ట్రాన్ని నడిపిస్తోంది..ఆక్వా రైతులకు సప్లయ్ చేసే సీడు, ఫీడు, పంట కొనుగోలు మొత్తం ప్రక్రియ చంద్రబాబు సిండికేట్ నడిపిస్తోంది…సీడు, ఫీడు రేట్లు నిర్ణయించేది వాళ్లేనన్నారు.
Also Read:‘మిస్టర్ మిడిల్ క్లాస్’..ఎంజాయ్ చేస్తారు!
లక్షల రూపాయలు ఖర్చు చేసి సాగు చేసిన రొయ్యలు, చేపల ధరలను సిండికేట్ ఢమాల్ అని పడేస్తోంది…చంద్రబాబు చర్మం కొంచెం మందం..దున్నపోతు వర్షం పడితే ఏమాత్రం కూడా చలించదో.. చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే మాదిరిగా తయారైందని చెప్పడానికి బాధపడుతున్నా అన్నారు.

