కాపు ఉద్యమనేత ముద్రగడ ఇకలేరు..

3
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కాపు సామాజికవర్గ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ముద్రగడ మృతి వార్త తెలియడంతో ఆయన స్వగ్రామం కిర్లంపూడితో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి.

ముద్రగడ పద్మనాభం కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా, కాపు సామాజిక వర్గ హక్కుల సాధన కోసం సుదీర్ఘ పోరాటం చేసిన యోధుడిగా గుర్తింపు పొందారు. కాపులను బీసీ జాబితాలో చేర్చాలంటూ ఆయన చేపట్టిన ఉద్యమాలు, రైలు రోకోలు, ఆమరణ నిరాహార దీక్షలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాయి.

తన సామాజికవర్గం శ్రేయస్సు కోసం ఏ ప్రభుత్వంతోనైనా సరే రాజీపడకుండా పోరాడే అరుదైన నైజం ఆయన సొంతం. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి ఆయన పలుమార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దివంగత ఎన్టీ రామారావు హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి పాలనలో తనదైన ముద్ర వేశారు. ఆ తర్వాత ఎంపీగా కూడా ఎన్నికై పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ, ప్రజల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు.

Also Read:రేవంత్ నిర్లక్ష్యం వల్లే సుప్రీంలో చుక్కెదురు

ముద్రగడ పద్మనాభం హఠాన్మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు వివిధ రాజకీయ పార్టీల అధినేతలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు మరియు కాపు సామాజికవర్గ ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

- Advertisement -